YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బొబ్బిలిలో ఫేక్ కరెన్సీ కలకలం

బొబ్బిలిలో ఫేక్ కరెన్సీ కలకలం

విజయనగరం చారిత్రాత్మకం ప్రాంతం. ఈ ప్రాంతం ప్రాశస్త్యం దెబ్బతినేలా ఇటీవలిగా గంజాయి అక్రమ రావాణా, ఇతరత్రా ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరోసారి దొంగనోట్ల చలామణిలో జిల్లా వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు సాలూరు కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగనోట్ల చలామణి వ్యవహారం నేడు బొబ్బిలి పట్టణానికి కూడా విస్తరించిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో ఇటీవలే  బొబ్బిలిలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భూమిలో పాతిపెట్టిన 12 రూ.500 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని పోలీసులు రూ.6లక్షలుగా గుర్తించినట్లు తెలిసింది. బొబ్బిలి బజార్‌ సెంటర్‌లో ఇటీవల కాలంలో ఎక్కువగా రూ. 500 నకిలీనోట్లు వ్యాపారుల దగ్గరకు వస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమై నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. వీరి ద్వారానే దాచిపెట్టిన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. 

 

నకిలీనోట్లు చెలామణి చేస్తున్నవారికి స్థానిక నేతలతో పరిచయాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు నుంచి తప్పించేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. దొంగనోట్ల చెలామణితో విజయనగరం గతంలోనూ వార్తల్లో నిలిచింది. 25ఏళ్ల క్రితం ఒక వ్యాపారి దొంగనోట్లు చెలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 15 ఏళ్ల క్రితం ఏకంగా దొంగనోట్లు ముద్రణా యంత్రం దొరికి పోలీసు కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం మళ్లీ దొంగనోట్లు చెలామణి అవుతున్నాయని తెలియడంతో పట్టణం మరోసారి ఉలిక్కి పడింది. కనుమరుగైందనుకున్న ఈ ముఠా మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించిందా అని అంతా ఆందోళన చెందారు. కొత్త నోట్లకూ నకిలీలు సృష్టించేసి ప్రజలతో గేమ్స్ ఆడుతున్నారన్న ఆవేదనలో కూరుకుపోయారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేంతోనే యువత ఇలాంటి నేరాలకు పాల్పతోందని పోలీసులు అంటున్నారు. అయితే ఫేక్ కరెన్సీ చలామణిలో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని, ఈ తరహా దందాకు యువత దూరంగా ఉండాలని, భవితను పాడు చేసుకోవద్దని హితవు పలికారు.

Related Posts