YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో ఎందుకిలా

టీడీపీలో ఎందుకిలా

విజయవాడ, అక్టోబరు 6,
గోరంట్లచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే ఎంపీ కేశినేని నాని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. తాను తన కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటామని చంద్రబాబుకు నేరుగా కేశినేని నాని చెప్పేసి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కేశినేని నాని విషయంలో సీరియస్ గా లేదా? కేశినేని పోటీ చేయకపోయినా పెద్దగా ఫరక్ పడదని భావిస్తుందా? అంటే అవుననే అంటున్నారు.గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేస్తాననగానే చంద్రబాబు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను బుజ్జగించడం కోసం త్రీమెన్ కమిటీని కూడా నియమించారు. పలు దఫాల చర్చల తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. ఇక్కడ గోరంట్ల, కేశినేని నాని డిమాండ్లు ఒకటే అయినా చంద్రబాబు స్పందన మాత్రం వేరేలా ఉంది.నిజానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు రాజకీయంగా అడ్డంపడుతున్న ఆదిరెడ్డి కుటుంబాన్ని కంట్రోల్ చేయాలని కోరారు. తాను చెప్పిన వారికి పార్టీ పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గోరంట్ల డిమాండ్లకు చంద్రబాబు అంగీకరించారు. ఫలితంగా బుజ్జగింపులతో బుచ్చయ్య చౌదరి దారికి వచ్చారు. ఇక కేశినేని నాని డిమాండ్ కూడా దాదాపు అటువంటిదే. తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పరోక్షంగా కోరారు.తనపై బహిరంగ విమర్శలు చేసిన బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావులపై చర్యలు తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్. అది చంద్రబాబుకు సాధ్యపడదు. ఇద్దరూ బెజవాడకు ముఖ్యమైన నేతలు. కేశినాని నాని ఒక్కరి కోసం ఇద్దరు ముఖ్యనేతలను వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. దీంతోనే కేశినేని నాని విషయంలో చంద్రబాబు పెద్దగా హడావిడి చేయలేదంటున్నారు. కొందరు కమ్మ సామాజికవర్గం నేతలను చంద్రబాబు కేశినేని నాని వద్దకు పంపి బుజ్జగింపు చర్యలు చేపడతారని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts