YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నానికి దూరమవుతున్న సామాజిక వర్గం

నానికి దూరమవుతున్న సామాజిక వర్గం

విజయవాడ, అక్టోబరు 6,
ప్పుడు మంత్రి పేర్ని నాని కాపులకు శత్రువుగా మారారా? నానిని కాపులకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవునను అంటున్నారు. పేర్ని నానికి, పవన్ కల్యాణ్ కు మధ్య జరిగిన మాటల యుద్ధంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను అందిపుచ్చుకుని ఆయన కాపులను దూషించాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన పేర్ని నాని తాను జగన్ పాలేరు అని చెప్పడాన్ని కూడా సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు.మంత్రి పేర్ని నాని ఇటీవల పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య జరిగిన మాటల యుద్దంలో కొంత గీత దాటి మాట్లాడారు. పవన్ కల్యాణ్ పేర్ని నానిని ఉద్దేశించిన వ్యాఖ్యలతో పాటు, వైసీపీ మంత్రులను కుక్కలతో పోల్చడంతో పేర్ని నాని పవన్ కల్యాణ్ పార్టీ నేతలను పందులతో పోల్చారు. అంతవరకూ బాగానే ఉన్నా కాపు కులం గురించి అభ్యంతరకరంగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు విపక్షాలు హైలెట్ చేస్తున్నాయి.ప్రధానంగా జనసైనికులు సోషల్ మీడియాలో పేర్ని నాని వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. అలాగే టీడీపీ నేత వంగవీటి రాధా సయితం పేర్ని నాని వ్యాఖ్యలను తప్పుపట్టారు. అడ్డదారుల్లో వచ్చిన వారే సొంత కులాలను విమర్శిస్తారని, కొందరికి సొంత కులాలను విమర్శించడం ఫ్యాషన్ అయిపోయందని వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు పేర్ని నానిని ఉద్దేశించి చేసినవే. టీడీపీ కాపు సామాజికవర్గం నేతలు కూడా పేర్ని నాని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కానీ పేర్ని నాని మాత్రం తాను కులాన్ని దూషించలేదని, తనను తాను తిట్టుకోవడంలో అలా అర్థమయిందని చెబుతున్నారు. తాను ఎప్పటికీ జగన్ కు పాలేరునేనని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పేర్ని నానిని కాపు సామాజికవర్గానికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పకతప్పదు. ఇటు టీడీపీ, అటు జనసేన సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్దయెత్తున పోస్టులు పెడుతున్నారు.

Related Posts