YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జాతీయ పార్టీలు సై

జాతీయ పార్టీలు సై

కడప, అక్టోబరు 6,
కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తుంది. అభ్యర్థిని ఖరారు చేయాల్సి వస్తుంది. ఇంకా నామినేషన్ కు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కాంగ్రెస్ నేతలు అభ్యర్థి ఎంపికపై ఈరోజో, రేపో ఒక స్పష్టత ఇచ్చే అవకాశముంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ తాను బరిలో ఉంటానని చెబుతుండటంతో, కాంగ్రెస్ కూడా పోటీకి దిగే అవకాశాలే కన్పిస్తున్నాయి. అంటే బద్వేల్ లో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన తప్పుకున్నా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కన్పించడం లేదు.ఉప ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు ఒక స్పష్టమైన విధానం ఉంది. వారు సంప్రదాయాలను పక్కన పెట్టేస్తారు. గతంలోనూ కాంగ్రెస్ తిరుపతి, నందిగామకు జరిగిన ఉప ఎన్నికల్లో బరిలోకి దిగింది. తిరుపతిలో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మింగా మృతి చెందడంతో ఎన్నిక రాగా, ఆయన సతీమణి సుగుణమ్మపై కాంగ్రెస్ పోటీకి దింపింది. ఆ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. అయినా భారీ మెజారిటీతోనే సుగుణమ్మ విజయం సాధించింది.రాష్ట్ర విభజన తర్వాత జరిగిన నందిగామ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పోటీకి దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు మృతి చెందడంతో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్యచేత టీడీపీ పోటీ చేయించింది. అప్పుడు కూడా వైసీీపీ సంప్రదాయాలను గౌరవించి పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఎన్నికను జరపాల్సి వచ్చింది. ఇలా కాంగ్రెస్ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అభ్యర్థులను బరిలోకి దింపుతూ ఏకగ్రీవానికి అడ్డుకట్ట వేస్తుంది.ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అక్కడ అభ్యర్థి ఎంపిక కోసం షేక్ మస్తాన్ వలిని కన్వీనర్ గా నియమించింది. గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లోనూ గోవిందరెడ్డి, కమలమ్మ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కమలమ్మ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. వైసీపీ ఏకగ్రీవానికి ప్రయత్నం చేస్తుంది. అయితే కాంగ్రెస్ మాత్రం బరిలో ఉండేందుకే ప్రయత్నిస్తుంది

Related Posts