YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సార, మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై ఉక్కుపాదం డిఎస్పి బాలచంద్రారెడ్డి

సార, మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై ఉక్కుపాదం డిఎస్పి బాలచంద్రారెడ్డి

రామచంద్రపురం
సార, మాదక ద్రవ్యాలు అమ్మినా, తయారుచేసినా, రవాణా చేసినా అటువంటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం జొన్నాడ తారకరామ కాలనీలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు, ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి 6 గంటల వరకు డి.ఎస్.పితో పాటు మండపేట రూరల్ సిఐ శివగణేష్ ఆధ్వర్యంలో 50 మంది ఎస్ఈబి, సివిల్ పోలీసులు కాలనీలో గల ప్రతి వీధిలోను సంయుక్తంగా జరిపిన దాడుల్లో సారా తయారు తయారుకు ఉపయోగించే 50 డ్రమ్ములు, 12 వంట గ్యాస్ సిలిండర్లు, 6 వంట పాత్రలు, 9 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఐదుగురుతో పాటుగా, తప్పించుకుని తిరుగుతున్న మరో పాత నేరస్తుడుని అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి వెల్లడించారు. అలాగే ఈ దాడుల్లో ఎటువంటి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ వాహనాలపై గతంలో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే స్వాధీనపరుచుకున్న ప్లాస్టిక్ డ్రమ్ములను సంఘటన స్థలంలోనే ధ్వంసం చేయగా, ద్విచక్ర వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డిఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ రామచంద్రపురం పోలీస్ డివిజన్ పరిధిలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే ఎంతటి వారైనా సహించేది లేదని, వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అలాగే సారా కార్యకలాపాల్లో పలుమార్లు అరెస్టయిన వారిపై పీడీ యాక్ట్ పై కేసులు నమోదు చేస్తామని అన్నారు. అలాగే ఇకపై డివిజన్ పరిధిలో నిత్యం దాడులు ఉంటాయని ఎవరైనా సారా, గంజాయ్ వంటి మాదక ద్రవ్యాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్, మండపేట పట్టణ ఎస్ఐ శివకృష్ణ, ఎస్ఈబి ఎస్ఐ లు ఈతకోట రవికుమార్, కె అన్నవరం పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts