YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మోడీ టార్గెట్ చంద్రబాబు.. కేసీఆర్ టార్గెట్ రేవంత్ రెడ్డి

మోడీ టార్గెట్ చంద్రబాబు.. కేసీఆర్ టార్గెట్ రేవంత్ రెడ్డి

రాష్ర్టంలో అవినీతి పై ఏసీబీ అధికారులతో ముఖ్యమంత్రి ఏడు గంటలకు పైగా సమీక్షచేసారని పేపర్లలో చూసా. రాజకీయ కక్ష సాధింపు కోసమే నిన్న ఏడుగంటలుఏసీబీ అధికారుల తో చర్చించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ కి చంద్రబాబు వల్ల జరిగిన నష్టాన్ని  ,అలాగే ఇక్కడ కేసీఆర్ ను నేను ప్రశ్నిస్తున్నాననే మోడీ ఆదేశాల మేరకు ఇక్కడి కేసీఆర్ ఓటుకు నోటుకేసు బయటకు తీసారని అయన విమర్శించారు. 2013లో నిమ్స్ లో లక్షా 60వేల రూ..లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ శేషగిరిరావు ను టిఆర్ఏస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కేసును క్లోజ్ చేసింది. కేసీఆర్ కు సన్నిహితులు అయిన వారి కేసులన్నింటిని కొట్టేసింది టిఆర్ఏస్ ప్రభుత్వం.. ఆధారాలు లేకుండా 125మంది వివిధ కేసుల్లో ఉన్న వారిని కేసీఆర్ విముక్తి కల్పించారని అయన గుర్తు చేసారు. వందలకోట్ల రూపాయలతో జరిగిన ప్లీనరీ పేరిట టిఆర్ఏస్ నేతలు వసూలు చేసారు. దీన్ని పై నేను కోర్టుకు వెళ్లాను. ఏసీబీ కి ,ఏన్నికల కమిషన్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసీఆర్ సన్నిహితుడైన వేముల వీరేశం అనే ఏమ్మెల్యే ఆ జిల్లా డిసిసిబీ కి 8లక్షలు లంచం ఇస్తా అన్నది వాస్తవం కాదా ఆధారాలు లేవా అని రేవంత్ ప్రశ్నించారు. నీవు నీ కొడుకు నీతిమంతులైతే టీ హబ్ నిర్మాణం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పై ఏసీబీ విచారణ జరుపాలని అయన డిమాండ్ చేసారు. ఆర్థిక ,రాజకీయ ప్రయోజనాలకోసమే ఏసీబీ అధికారులతో సీఏం సమీక్ష జరిపారు. నీ అత్యా రాజకీయాలకు ,బెదిరింపు రాజకీయాలకు బయపడేది లేదని అయన అన్నారు. మోడీ టార్గెట్ చంద్రబాబు.. కేసీఆర్ టార్గెట్ రేవంత్ రెడ్డి అని అయన అన్నారు.

Related Posts