విశాఖపట్నం
దేశంలో నరేంద్ర మోడి, రాష్ట్రం లో జగన్మోహనరెడ్డి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేస్తే ప్రస్తుత నేతలు నిర్వీర్యం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ వీజేఎఫ్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రం లో రాజశేఖరరెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసిందని, అప్పుడు తాము అలా చేయకపోతే ఇప్పుడు జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వాడు కాదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో వున్న ఎనబై లక్షల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్కాలర్ షిప్ లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణమే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధి హయాంలో ఏర్పడిన విశాఖ ఉక్కు ని ఎటువంటి పరిస్థితులలో ప్రైవేటు పరం కానివ్వమన్నారు.2024 లో కేంద్రంలో ,రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు.