YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఓట్లు ఎవరికి..

టీడీపీ ఓట్లు ఎవరికి..

కడప, అక్టోబరు 7,
బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమయింది. ప్రధాన పార్టీలు బరి నుంచి తప్పుకున్నా ఎన్నిక జరగాల్సి ఉంది. బలం లేని పార్టీలతో బలప్రదర్శన చేస్తుంది. సమఉజ్జీలు లేకపోవడంతో బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సునాయాసమయింది. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు పోటీ పడుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను ప్రకటించింది. ఇక్కడ రెండు ప్రధాన జాతీయ పార్టీలకూ ఓటు బ్యాంకు లేదు. దీంతో వైసీపీకి ఏకపక్ష విజయమే. అయితే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఓటు బ్యాంకు ఎటువైపు మరలతాయన్నది ఆసక్తికరంగా మారింది.తెలుగుదేశం పార్టీ, జనసేన బద్వేలు ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. ఇక్కడ ఒక్క టీడీపీయే బలంగా ఉంది. బలమైన నేతలున్నారు. అయితే వైసీపీకి రికార్డు స్థాయి మెజారిటీ రాకుండా ఉండేందుకు ఈ పార్టీ ఓటు బ్యాంకు ఏ పార్టీవైపు తరలుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి గత ఎన్నికల్లో దాదాపు యాభై వేలకు పైగానే ఓట్లు వచ్చాయి. వైసీపీ 44 వేల ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో గెలిచింది.అయితే బద్వేలులో టీడీపీ ఓటు బ్యాంకు ఇప్పుడు బీజేపీకి టర్న్ అవుతుందా? లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్తం లోపాయికారీగా ఈ ఎన్నికల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొందరు నేతలు కాంగ్రెస్ కు మద్దతిస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని దెబ్బతీయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానంగా టీడీపీపై ఒంటికాలు మీద లేస్తున్న సోము వీర్రాజు నాయకత్వాన్ని కూడా ఈ ఎన్నిక ద్వారా ప్రశ్నించవచ్చని వారు భావిస్తున్నారు.కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో ఎదిగే అవకాశం లేదు. ఆ పార్టీకి బద్వేలులో మద్దతిచ్చినా వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి తిరిగి తమ ఓటు బ్యాంకు తమకు ఉంటుందన్న క్యాలిక్యులేషన్ లో ఉన్నారు. తమ క్యాడర్ కు త్వరలోనే ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపై పరోక్షంగా స్థానిక నాయకత్వం సంకేతాలు పంపుతుందంటున్నారు. మొత్తం మీద టీడీపీ ఓటు బ్యాంకు బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళుతుందన్న టాక్ కడప జిల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
జనసేన ఓటర్లు దారెటు
తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై త్వరగా క్లారిటీ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇందుకోసం ఎదురు చూస్తుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలసి పోటీ చేస్తుందన్న ప్రచారం రోజురోజుకూ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా ఆ రెండు పార్టీల అడుగులు కన్పిస్తున్నాయి. దీంతో దీనిపై తేల్చేయడానికి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది.పవన్ కల్యాణ్ ను వదులకోవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టంలేదు. చరిష్మా ఉన్న నేత కావడం, ఒక సామాజికవర్గానికి బ్రాండ్ గా ఉండటంతో ఆయనతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన. అందుకే బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిచేతనే ప్రకటన చేయించారు. కానీ పవన్ కల్యాణ్ కు సీఎం పదవి కన్నా జగన్ ను ఓడించడమే లక్ష్యంగా కన్పిస్తుంది.అందుకే బలం లేని బీజేపీతో కలసి ప్రయాణించడం కంటే టీడీపీతో వెళ్లడమే ఉత్తమం అని అనుకంటున్నారు. అందుకే వరసగా టీడీపీకి దగ్గరయ్యే డైలాగులు ఆయన నుంచి వినపడుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడంలో ఆ రెండు పార్టీలు అనుకునే చేశాయన్న అనుమానాలు లేకపోలేదు. అందుకే సోము వీర్రాజు ఇప్పడు పవన్ కల్యాణ్ కు పరీక్ష పెట్టనున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారు.బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు కోరనున్నారు. అంటే ఒకరకంగా పవన్ కు ఇది కష్టమే. తాను బరి నుంచి తప్పుకున్నా, బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా పవన్ కల్యాణ్ ప్రచారం చేసే అవకాశం 99 శాతం ఉండకపోవచ్చు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రాకుంటే ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారనే బీజేపీ భావిస్తుంది. జనసేన తమ నుంచి వెళ్లిపోయినా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకునే వీలుకలుగుతుందని సోము వీర్రాజు అంచనా వేస్తున్నట్లుంది. అందుకే ఇప్పడు బద్వేల్ కు జనసేనాని వస్తారా? రారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts