న్యూఢిల్లీ అక్టోబర్ 7
లఖింపూర్ ఖేరీ కేసులో ఎంత మందిని అరెస్ట్ చేశారు? సవివరమైన నివేదికను శుక్రవారం సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఈ ఘటనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ ఈ రిపోర్ట్‌లో చనిపోయిన వారి వివరాలతోపాటు ఎఫ్ఐఆర్ సమాచారం, ఎవరిని అరెస్ట్ చేశారు, విచారణ కమిటీ వంటి మొత్తం సమాచారం ఉండాలని స్పష్టం చేసింది.ఇక ఈ ఘటనలో మృత్యువాత పడిన రైతు లవ్‌ప్రీత్ సింగ్ తల్లి చికిత్స కోసం యూపీ ప్రభుత్వం అవసరమైన సాయం చేయాలని ఆదేశించింది. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రా కారుతో దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఇప్పటికే యూపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ విచారణ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.