హైదరాబాద్ అక్టోబర్ 7
శాసనసభలో పల్లె ప్రగతి పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. వక్ఫ్ బోర్డు భూముల విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సమస్యలపై మొన్న మాట్లాడారు. పేదలకు న్యాయం చేయాలని కోరారు. తప్పకుండా ప్రభుత్వ సానుకూలంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల మీద విచారణ జరిపించాలి అంటున్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వంలో రికార్డుల ఆధారంగా దేవాదాయ, వక్ఫ్ బోర్డులు ఫ్రీజ్ అయ్యాయి. గవర్నమెంట్ పరంగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు చేయడం జరగదన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో మన వారు సరిగా వాదించడం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. వక్ఫ్ బోర్డుల విషయంలో జరిగిన దారుణాలపై సీబీసీఐడీ విచారణకు ఇవాళే ఆదేశిస్తాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో కన్నా టిఆర్ఎస్ హయం లో జీతాలు ఎక్కువ : కేసీఆర్
రాష్ట్రంలో సర్పంచ్‌ల కంటే సఫాయి కార్మికులకే ఎక్కువ జీతం ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో పర్ క్యాపిట రూ. 4 ఇస్తే, తెలంగాణ మాత్రం రూ. 669 ఇస్తోంది. ఈ విషయం సర్పంచ్‌లు, ప్రజలు వింటున్నారు. జీహెచ్ఎంసీలో కార్మికులకు రూ. 8500 ఇస్తే.. ఈరోజు కార్మికుల జీతాలు రూ. 17 వేలు. సర్పంచ్‌ల కంటే ఎంపీటీసీల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాము. సఫాయి అన్న నీకు సలాం అని చెప్పిన. కార్మికులను మనం గౌరవించాలి. గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు దండం పెట్టాలి. గ్రామపంచాయతీ సిబ్బందికి రూ. 8500ల చొప్పున ఇస్తున్నాం. మున్సిపాలిటీల్లో రూ. 12 వేలకు తగ్గకుండా జీతాలు ఇస్తున్నాం.సర్పంచ్‌ల గౌరవ వేతనాలు ఒకప్పుడు చాలా తక్కువ. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లకు గతంలో రూ. 7500 ఉండే. ఇప్పుడు లక్ష రూపాయాలు టీఆర్ఎస్ ఇస్తుంది. జడ్పీటీసీలకు గతంలో రూ. 2250 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నాం. మండల ప్రజాపరితష్ సభ్యులకు గతంలో రూ. 1500 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నాం. సర్పంచ్‌లు, ఎంపీటీలకు రూ. 6500లకు పెంచాం. లోకల్ బాడీస్ కు ఇచ్చే నిధుల్లో కేంద్రం 25 శాతం కోత విధించింది అని సీఎం తెలిపారు.గ్రెస్ హయాంలో మంచినీళ్లు లేవు, కరెంట్ లేదు. వంగిపోయిన కరెంట్ స్తంభాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో ఘోరమైన పరిస్థితి ఉండే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుతో సుదీర్ఘంగా చర్చించి, పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,33,000 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశాం. 59 వేల కి.మీ. మేర విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.