YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ ఛైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి

శ్రీ ఛైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి

విజయవాడ
శ్రీ ఛైతన్య యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ ఈడుపుగల్లు శ్రీ చైత్యన్య హాస్టల్  రూమ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న ఎం.స్నేహిత్ వర్మ సూసైడ్ చేసుకొని చనిపోయిన విద్యార్థి మృతి పై సమగ్రమైన విచారణ జరిపించాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి - ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కే.ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించారు. అనంతరం కృష్ణాజిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవికుమార్ గారికి, కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ. విశ్వనాద్ కి వినతిపత్రం అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కే ప్రసన్న కుమార్ మాట్లాడుతూ చైతన్య - నారాయణ విద్యాసంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు అరికట్టడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. అధిక ఫీజుల రూపంలో విద్యార్థులను తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కార్పెరేటు విద్యాసంస్థలు గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ పరిధిలోని రెండు వందల మంది పైగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వీటిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయిని అన్నారు.
కృష్ణాజిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డూ అదుపు లేకుండా ఫీజుల రూపంలో విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వీటిపై వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరియు చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇంటిస్థలం కుటుంబ సభ్యులకు కేటాయించాలని, ప్రభుత్వాన్ని కోరారు. దీనితోపాటు ఆవిద్యార్థిని మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పశ్చిమ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోటి,జిల్లా కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షుడు సి.హెచ్. వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఏసుబాబు, నగర నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Related Posts