YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

20 వేల కోట్లే ఇస్తాం

20 వేల కోట్లే ఇస్తాం

విజయవాడ, అక్టోబరు 7,
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న పోలవరం ప్రాజెక్టు నిధులపై మోదీ సర్కారు తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరిన నేపథ్యంలో కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ ఇప్పటికే రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ లేఖను పరిశీలించిన మీదట నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ తేల్చిచెప్పేసింది. ఆ లేక సమాచారాన్ని కేంద్ర జల శక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. కాగా, నిన్న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి దీనిపై చర్చించారు. పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేఖపై మంతనాలు జరిపారు. క్యాబినెట్ తీర్మానానికి కట్టుబడి ఉంటామని కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తూ.. ఈ మేరకు జలశక్తి శాఖకు లేక రాసింది.

Related Posts