హైదరాబాద్, అక్టోబరు 7,
సమంత -నాగచైతన్య విడిపోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి .. ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ చూసిన దీనిగురించే చర్చ జరుగుతుంది. సమంత- నాగచైతన్య ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.. చైతన్య- సమంతది దాదాపు ఏడేళ్ల బంధం. ఇక విడాకులు అనౌన్సచేసిన తర్వాత సమంత వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వస్తుంది. ఇండైరెక్ట్‌గా తన పోస్ట్‌లతో ఎదో చెప్పాలని చూస్తుంది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఇది తాజాగా చేసిన పోస్ట్ కాదు.. పెళ్ళి రోజు సందర్భంగా సమంత ఎంతో ఎమోషనల్‌గా చేసిన పోస్ట్ .. అదేంటే..2017 అక్టోబర్ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అంత సవ్యంగా ఉండుంటే నేడు ఈ జంట ఘనంగా పెళ్లిరోజు జరుపుకునేవారు.. ఈక్రమంలో సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. గత ఏడాది ఇదే రోజున తమ పెళ్లిరోజు సందర్భంగా సామ్ చైతన్యతో కలిసి ఉన్న ఫొటోతో పాటు.. ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఇక పై జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్’’ అని పోస్ట్ చేసింది సామ్. ఇప్పుడు ఈపోస్ట్ వైరల్ గా మారింది. ఇక సమంత నాగచైతన్య విడిపోతున్నారని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరు తమ వివాహబంధానికి ముగింపు పలుకుతూ.. సోషల్ మీడియా వేదికగా తాము విడిడిపోతున్నామని ప్రకటించారు. సమంత నాగచైతన్య విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఒంటరిగా ఇలా
సమంత.. నాగచైతన్య టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్.. ఈ జంటకు అభిమానులు ఎక్కువే.. ఏడేళ్లు ప్రేమ అనంతరం.. పెద్దలను ఒప్పించి మరి ఘనంగా వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా గడిపిన జంటగా.. ఆకస్మాత్తుగా విడాకుల ప్రకటన ఇచ్చి షాకిచ్చింది. ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉండే సామ్ చైతన్యలు విడాకులు తీసుకోవడంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. 2017 అక్టోబర్ 7న వీరిద్దరి వివాహం జరిగింది. ఇక ఈనెల అక్టోబర్ 2న వీరిద్దరూ తాము విడాకులు తీసుకున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. విడాకుల ప్రకటన అనంతరం చైతూ సైలెంట్ అయ్యాడు. కానీ సమంత మాత్రం.. సోషల్ మీడియా వేదికగా.. తన ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తేలా ఎమోషనల్ కోట్స్ చేస్తూ వచ్చింది.ఇదిలా ఉంటే.. ఈరోజు (అక్టోబర్ 7న) సమంత.. నాగచైతన్యల పెళ్లిరోజు.. ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ చేస్తూ తన సింగిల్ ఫోటో షేర్ చేసింది. పాత ప్రేమ పాటలు – పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. అందులో సామ్.. తెల్లని డ్రెస్ ధరించి.. నేలవైపు చూస్తూ ఒంటరిగా నడుస్తూ కనిపిస్తుంది. ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.