YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్టేట్ బ్యాంకు రుణ మేళాను సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

స్టేట్ బ్యాంకు రుణ మేళాను సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

స్టేట్ బ్యాంకు రుణ మేళాను సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు
నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరి దేవి కళాశాల ప్రాంగణంలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రుణ మేళ ను జిల్లా కలెక్టర్ చక్రధర బాబు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా కలెక్టర్ చక్రధర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వర్గాలను దృష్టిలో ఉంచుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు మంజూరు చేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్న గృహ వాహన  , విద్య , పరిశ్రమల స్థాపన తదితర రుణాలను తీసుకొని తమ భవిష్యత్తు లను మార్చుకో వలసిందిగా కోరారు . తీసుకున్న రుణాలను గడువు వాయిదాల లోపల చెల్లిస్తూ వచ్చినట్లయితే మరికొంతమందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు . దేశంలోనే పెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంకు సేవలను కొనియాడారు . ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిందన్నారు. పరిశ్రమల స్థాపన, గృహ నిర్మాణాలు, విద్య, వాహన, వ్యక్తిగత రుణాలు అందించడంలో స్టేట్ బ్యాంకు నంబర్ 1 స్థాయిలో ఉందన్నారు. బ్యాంకు తమ వ్యాపార వృద్ధిలో భాగంగా ఆయా ప్రాంతాలలో ఆయా శాఖల ద్వారా వివిధ వ్యాపార సంస్థలతో సంయుక్తంగా మెగా లోన్ మేళాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా ప్రధాన శాఖ ఆధ్వర్యంలో  7, 8, 9 తేదీలలో మెగా లోన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అవకాశాన్ని సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం పవన్ తో పాటు స్థానిక స్టేట్ బ్యాంకు శాఖల అధికారులు, సిబ్బంది తో పాటు వివిధ వ్యాపార సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts