ఏసీబీ వలలో తహశీల్దార్ అండ్ కో
నాగర్ కర్నూలు
భూమి రిజిస్టేషన్ పత్రాల కోసం డబ్బులు తీసుకుంటూ తహశీల్దార్, విఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ చిక్కిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. తహశీల్దార్ సయ్యద్ షోకాత్ అలీ, విఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ 12వేలు రూపాయలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. కుడికిల్ల గ్రామానికి చెందిన బండారు.స్వామి తన చెల్లెలి పేరు పై ఉన్న సర్వే నెంబర్..303, నార్లాపూర్ శివారులో ఉన్న 5 ఎకరాల 20 గుంటలు భూమి రిజిస్టేషన్ చేయించారు. రిజిస్టేషన్ అయిన ఏడు డాక్యుమెంట్ లకు ఒక్కొక్క దానికి 2500 రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు బంగారు స్వామి అంత ఇవ్వలేను అంటూ 12000వేలు మాట్లాడుకొని,ఏసీబీని ఆశ్రయించాడు.డబ్బులు ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించాడు. తహశీల్దార్, విఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1096 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.