మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య
నేటి యువతకు ఆదర్శం 6వ సారి రక్తదానం
కామారెడ్డి అక్టోబర్ 07
కామారెడ్డి జిల్లా కేంద్రం భిక్ నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించడంతో బిబీపేట మండలం రామ్ రెడ్డిపల్లి కి గ్రామానికి చెందిన లావణ్య కు తెలియజేయగానే ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి లావణ్య ఎంతో ఆదర్శమని 35 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రక్తదానం చేయడం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది అన్నారు. గతంలో కూడా 5 సార్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు లావణ్య ను స్ఫూర్తిగా తీసుకొని ఆపద సమయంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన లావణ్యను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్,రాజు, పాల్గొనడం జరిగింది.