జగన్మాత ను బాలాత్రిపురసుందరి గా దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతం
విజయవాడ
జగన్మాత ను బాలాత్రిపురసుందరి గా దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతమని పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అయన ఇంద్రకీలాదరిలో దుర్గమ్మను దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ భవానీ మాల ప్రతీ సంవత్సరం వేసుకుంటాను. టెక్నాలజీ కి అందని విషయాలు చాలా ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాలూ దర్శించుకోవడం నాకు అలవాటు. శక్తి అన్ని చోట్లా కొలువుండటంతో రాష్ట్రంలో కష్టాలు లేవు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నా. అత్యధిక వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం మనది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం కు అమ్మవారు శక్తినివ్వాలని కోరుకుంటున్నా.దసరా ఉత్సవాలు మైసూరు, విజయవాడలలో జరుగుతున్నాయని అన్నారు.