ఇండియాను వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓడిస్తే, పాక్ జట్టుకు బ్లాంక్ చెక్స్
పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా కొన్ని కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ అక్టోబర్ 8
పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఇచ్చిన 50 శాతం నిధులతోనే పీసీబీ నడుస్తోందని, అలాగే ఐసీసీకి 90 శాతం ఫండింగ్ ఇండియా నుంచి అందుతుందని, ఒకవేళ ఇండియా తన నిధులను ఐసీసీకి ఆపడం నిలిపివేస్తే, అప్పుడు పీసీబీ కుప్పకూలుతుందని, ఎందుకంటే ఐసీసీకి పీసీబీ నయా పైసా ఇవ్వడంలేదని రమీజ్ రాజా అన్నారు. పాకిస్థాన్ క్రికెట్‌ను బలోపేతం చేయాలనుకున్నానని, అయితే ఓ పెద్ద ఇన్వెస్టర్ భారీ ఆఫర్ ఇచ్చాడని, ఒకవేళ ఇండియాను వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓడిస్తే, పాక్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు ఆ ఇన్వెస్టర్ ముందుకు వచ్చినట్లు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తెలిపారు. ఉత్తమమైన క్రికెట్ జట్టు ఉండాలంటే, బలమైన ఆర్థిక వ్యవస్థ కూడా కీలకమని రాజా అన్నారు. హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అప్పుడే వెదర్ హీటెక్కింది. అక్టోబర్ 24న జరగనున్న ఇండో-పాక్ సమరానికి ఫుల్ క్రేజీ పెరుగుతోంది. టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఆడనున్నది. దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్ ఆజమ్ టీమ్‌తో కోహ్లీ సేన 24వ తేదీన తలపడనున్నది. అయితే దీని గురించి పాక్ సేనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో చర్చ వచ్చినట్లు తెలుస్తోంది.