YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడపలో లోకల్, నాన్ లోకల్

కడపలో లోకల్, నాన్ లోకల్

కడప, అక్టోబరు 9,
బద్వేలు ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని తొలుత నిర్ణయించింది. లోకల్, నాన్ లోకల్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ నాన్ లోకల్ అంటూ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆమె గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని చెబుతోంది. టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ బద్వేలులోనే ఉంటారని బాగానే ప్రచారం చేసింది. అయితే ఉన్నట్లుండి పోటీ నుంచి విరమించుకోవడంతో  అభ్యర్థి  రాజశేఖర్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది.బద్వేలు ఉప ఎన్నిక ద్వారా తెలుగుదేశం పార్టీ రెండు రకాలుగా లబ్ది పొందాలని ప్రయత్నించాలని తొలుత భావించింది. వైసీపీ మెజారిటీని తగ్గించి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడం ఒకటి కాగా, రెండోది జనసేన, బీజేపీ కలసి పోటీ చేసినా వారి బలమేంటో వారికి మరొకసారి తెలియజెప్పాలని కూడా టీడీపీ భావించింది. బీజేపీతో ఉంటే జనసేనకు కనీస ఓట్లు కూడా రావన్న విషయాన్ని బద్వేలు ఉప ఎన్నిక ద్వారా చెప్పాలని అనుకుందితిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలం ఏంటో తెలిసింది. అప్పటి నుంచే పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు కన్పించింది. బీజేపీతో కలసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో కనీస స్థానాలను కూడా సాధించలేమన్న విషయాన్ని తిరుపతి ఉప ఎన్నికల ద్వారా జనసేన గుర్తించిందని టీడీపీ భావించింది. మరోసారి బద్వేలు ఉప ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ కూటమి ఓటు బ్యాంకును భారీగా గండి కొట్టి జనసేనను తమ వైపుకు తిప్పుకోవాలని రాజశేఖర్ ను పార్టీ అభ్యర్థిగా  తొలుత చంద్రబాబు ప్రకటించారు.బద్వేలు ఉప ఎన్నిక జనరల్ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను మార్చివేస్తాయని టీడీపీ బలంగా విశ్వసిస్తుంది. అందుకే ఇప్పడు బద్వేలు పోటీ నుంచి తప్పుకుంది. కానీ తనను పిలిపించుకుని బలవంతంగా పోటీకి ఒప్పించారని, కొద్ది రోజులుగా తాను ప్రచారం చేసుకుంటున్నానని, ఖర్చు కూడా అయిందని అభ్యర్థి రాజశేఖర్ చెబుతున్నారు. పొలిట్ బ్యూరో సమావేశం పెట్టి హడావిడి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాగైతే టీడీపీ క్యాడర్ ఏం కావాలని? ఇప్పుడు ఓట్లు ఎవరికి వేయాలో మీరే చెప్పండని అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి నిలదీసినట్లు సమాచారం. మొత్తం మీద బద్వేల్ బరి నుంచి తప్పుకోవడం అక్కడి పార్టీనేతలు, క్యాడర్ లో అసంతృప్తిని రగిలించింది.

Related Posts