YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హెటిరో దాడులు వెనుక..?

హెటిరో దాడులు వెనుక..?

విశాఖపట్టణం,అక్టోబరు 9,
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయం స్టార్ట్ చేసిందా? ఎన్నికలకు ముందు ప్రతి రాష్ట్రంలో అమలు చేసే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేస్తుందా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. వరసగా జగన్ సన్నిహితులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతుండటం ఇందుకు అద్దం పడుతుంది. జగన్ కు అత్యంత సన్నిహితులైన వారిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడానికే ఈ దాడులు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తుంది.నిన్నగాక మొన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులతో వైసీపీ నేతలను కూడా వదిలిపెట్టబోమని బీజేపీ పరోక్షంగా సంకేతాలను పంపింది. దాదాపు రెండు రోజుల పాటు జరిగిన రాంకీ సంస్థలపై జరిగిన దాడుల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. భారీగా జరిమానా కూడా విధించే అవకాశముందని చెబుతున్నారు.తాజాగా రెండు రోజుల నుంచి జగన్ కు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త పార్థసారధి రెడ్డికి చెందిన హెటిరో సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పెద్దయెత్తున నగదు దొరికిందని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇరవై బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. పార్థసారధి రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంచి సంబంధాలున్నాయి.పార్థసారధి రెడ్డికి చెందిన హెటిరో సంస్థకు విశాఖలోనూ జగన్ ప్రభుత్వం ఇటీవలే స్థలాన్ని కేటాయించింది. టీటీడీలో సభ్యుడిగా కూడా నియమించింది. అత్యంత ధనవంతుడిగా పేరున్న పార్థసారధి రెడ్డి వైసీపీకి ఎన్నికల సమయంలో పెద్దయెత్తున ఆర్థిక సాయం అందిస్తారన్న పేరుకూడా ఉంది. దీంతో బీజేపీ జగన్ ప్రభుత్వాన్ని ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుందంటున్నారు. జగన్ సన్నిహితులు మరికొందరిపై ఐటీ దాడులు జరిగే అవకాశముందని అంటున్నారు.హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్‌ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. హెటిరో డ్రగ్స్‌ కార్యాలయంతో పాటు 22 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.. ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ. 200 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల్లో భాగంగా.. బోరబండలోని ఓ ఫ్లాట్‌ నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. ఆ క్యాష్‌ను ఏకంగా నాలుగు వాహనాల్లో కోఠిలోని బ్యాంక్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది.. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు అధికారుల ఇళ్లలోనూ క్యాష్‌ దొరికినట్టుగా సమాచారం.. ఆ నగదుపై సరైన ఆధారాలు చూపెట్టక పోవడంతో ఆ మొత్తాన్ని సీజ్‌ చేశారు అధికారులు.. మొత్తంగా రూ. 200 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో ఇన్‌వాయిస్‌లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts