YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తాడికిండలో తమ్ముళ్లలో లుకలుకలు

తాడికిండలో తమ్ముళ్లలో లుకలుకలు

గుంటూరు, అక్టోబరు 9,
మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ కీలకంగా భావించే ప్రాంతానికి చెందిన నాయకుడు. నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జ్‌ కూడా. ఆయనకు తెలియకుండానే అక్కడ కొందరికి పార్టీ పదవులు ఇచ్చేశారు. పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదా? సైడ్‌ చేసిందా? లైట్‌ తీసుకుంటుందా? ఎవరా నాయకుడు? ఏంటా ప్రాంతం?శ్రావణ్‌ కుమార్‌. టీడీపీ మాజీ ఎమ్మెల్యే. రాజధాని అమరావతిలోని కీలక నియోజకవర్గమైన తాడికొండలో 2014లో టీడీపీ నుంచి గెలిచారు. గత ప్రభుత్వం అమరావతికి ప్రాధాన్యం ఇవ్వడంతో అక్కడ కీలకంగా మారారు శ్రావణ్‌ కుమార్‌. రాజధానిని ప్రకటించడంతో అమరావతి ప్రాంతంలో టీడీపీకి తిరుగే ఉండబోదని లెక్కలేసుకున్నారు పార్టీ నాయకులు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ఈక్వేషన్స్‌ మారిపోయాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌కు తాడికొండ టికెట్ నిరాకరించింది పార్టీ. దీంతో స్థానిక నేతలు చంద్రబాబు దగ్గర పట్టుబట్టి శ్రావణ్‌కు టికెట్‌ ఇప్పించుకున్నా ఓటమి తప్పలేదు. ప్రస్తుతం తాడికొండ టీడీపీ ఇంఛార్జ్‌తోపాటు గుంటూరు పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడిగానూ ఆయనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ శ్రావణ్‌ కుమార్‌కు తెలియకుండానే కొందరు స్థానికులకు టీడీపీలో పదవులు కట్టబెట్టడం రచ్చ రచ్చ అవుతోంది.పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలో నియోజకవర్గ ఇంఛార్జులు సూచిస్తారు. లేదా అధిష్ఠానమే ఫలానా వారికి పార్టీ పదవి ఇవ్వాలని భావిస్తే.. అక్కడి ఇంఛార్జ్‌కు చెబుతుంది. కానీ.. తుళ్లూరు మండలానికి చెందిన ఓ మహిళా నేతను తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టు ఇంఛార్జ్ శ్రావణ్‌కుమార్‌కు తెలియదట. దీంతో ఈ మాజీ ఎమ్మెల్యేకు టీడీపీ పెద్దలు ఎందుకు చెప్పలేదు? 2019లో టికెట్‌ ఇచ్చే సమయంలో చెడినట్టే.. ఇప్పుడు కూడా గ్యాప్‌ వచ్చిందా? మాజీ ఎమ్మెల్యేను పట్టించుకోనక్కర్లేదని టీడీపీ భావిస్తోందా? ఆయనకు చెప్పకపోయినా ఫర్వాలేదని అనుకుందా? లేక శ్రావణ్‌కుమార్‌ను లైట్‌ తీసుకుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే పార్టీలో చర్చగా మారాయి.సదరు మహిళకు పార్టీ పదవి ఇవ్వడంపై ఇంఛార్జ్‌ శ్రావణ్‌కుమార్‌కు కూడా అభ్యంతరాలు ఉన్నాయట. ఆయన కూడా టీడీపీ పెద్దల నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఒక్క శ్రావణ్‌ కుమారే కాదు.. తుళ్లూరు మండలానికి టీడీపీ కేడర్‌ కూడా భగ్గుమంది. ఓపెన్‌గానే తమ అసంతృప్తిని బయటపెట్టారు. టీడీపీ అధిష్ఠానం తమను కించపరించిందని స్థానిక పార్టీ నేతలు.. తమ పదవులకు రాజీనామా చేసి కలకలం రేపారు. అమరావతి జేఏసీ ప్రతినిధులు సైతం అభ్యంతరాలు తెలిపారు. టీడీపీలోని దళిత సంఘాలు భగ్గుమన్నాయి.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా, ఎంపీలుగా పదవులు అనుభించిన చాలా మంది.. ఓడిన తర్వాత పత్తా లేకుండాపోయారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ మాత్రం తాడికొండలో పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. అయినప్పటికీ పార్టీ పదవుల పంపకంలో శ్రావణ్‌ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఆయన్ని అడిగి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీ భావించిందా? అలాంటి అవసరం లేదనుకుందా? మొత్తానికి ఒక పదవి.. టీడీపీ కీలకంగా భావిస్తున్న ప్రాంతంలో పెద్ద చిచ్చే పెట్టింది. మాజీ ఎమ్మెల్యేపై మరోసారి చర్చా మొదలైంది. మరి.. ఈ సమస్య ముదురు పాకాన పడకుండా పార్టీ అధినాయకత్వం ఏ చేస్తుందో చూడాలి.

Related Posts