YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఆ ఆరుగురిలో సర్వే టెన్షన్

విశాఖ ఆ ఆరుగురిలో సర్వే టెన్షన్

విశాఖపట్టణం, అక్టోబరు 9,
విశాఖ వైసీపీలో అంతర్గత సర్వే టెన్షన్ పుట్టిస్తోందా? ఎమ్మెల్యేల పనితీరుకు హైకమాండ్ గీటురాయి పెట్టిందా? ఈ నివేదికలు కొందరు శాసనసభ్యుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయా? నెగెటివ్ స్కోర్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ నేతలు ఆరా తీస్తున్నారా2019 ఎన్నికల్లో తెలుగుదేశం కంచుకోటలను బద్ధలు కొట్టింది వైసీపీ. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా పిలుచుకునే విశాఖజిల్లాలో 11 అసెంబ్లీ సీట్లు.. మూడు ఎంపీ స్ధానాలను కైవశం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో పరిస్ధితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక వ్యవస్థ నడుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు.. ప్రభుత్వ విధానాలపై ప్రజాభిప్రాయాన్ని వివిధ మార్గాల ద్వారా సేకరిస్తోంది. ఐతే, ఇప్పుడు నిర్వహిస్తున్న అంతర్గత సర్వే పూర్తిగా భిన్నమైందనే చర్చ అధికారపార్టీలో ఆసక్తికరంగా మారిందిరెండున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని, నాయకత్వాన్ని సిద్ధం చేస్తోంది వైసీపీ హైకమాండ్‌. ఇటీవల కొన్ని సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించాయట. లేటెస్ట్‌గా ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ విశాఖలో సర్వే ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. పీకే బృందం సేకరిస్తున్న అంశాలేంటనేది పార్టీలో చర్చగా మారింది. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారట. పార్టీ తరఫున నిర్వహిస్తున్న సర్వేలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారట. పాదయాత్ర కంటే ముందు నుంచి పార్టీలో సభ్యత్వం కలిగిన కేడర్, లీడర్ల నుంచి మాత్రమే ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారిచ్చే సమాచారమే పక్కా అనే అభిప్రాయం ఉందట.ఇటీవల కొందరు వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్నవారికి నామినేటెడ్‌ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందనే చర్చ ఉంది. ఇక యంత్రంగం తమ మాటకు విలువివ్వడం లేదని కొందరు ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. చిన్నపాటి పనులు కూడా చేయించుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారట. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.ఎమ్మెల్యేల పనితీరు.. నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత.. అంతర్గత వ్యవహారాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారట. దీంతో నెగెటివ్ స్కోర్ వచ్చే ఎమ్మెల్యేలు ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఆ జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఆరుగురిలో ఒకరు సీనియర్‌ ఎమ్మెల్యే కాగా.. మిగలిన వారు ఫస్ట్‌ టైమ్‌ శాసన సభ్యులుగా చెబుతున్నారు. గ్రేటర్‌ విశాఖ పరిధిలో రెండు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నాలుగుచోట్ల ప్రతికూల వాతావరణం ఉందని చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు, అంతర్గత విభేదాలు కొందరు ఎమ్మెల్యేలకు నెగెటివ్ స్కోర్ మూటగట్టాయనేది ఓ వాదన. అధికారికంగా చెప్పకపోయినా స్ధానిక సంస్ధల ఎన్నికలను ప్రభుత్వం రెఫరెండంగానే భావించిందట. జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ పరీక్షలో నెగ్గినప్పటికీ.. కొందరికి ఇబ్బందికర పరిస్థితులు ఎదరయ్యాయి. సీట్లు పెరగకపోయినా ప్రతిపక్షానికి ఓట్లు పెరగడం వైసీపీని ఆలోచనలోపడేసిందట. అందుకే దిద్దుబాటు చర్యల కోసం సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. మరి.. ఈ సర్వే ఆధారంగా పార్టీ చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.

Related Posts