YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇక మిగిలింది ప్రచారమే

ఇక మిగిలింది ప్రచారమే

కరీంనగర్, అక్టోబరు 9,
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకఘట్టం ముగిసింది.నామినేషన్ల చివరి రోజు కావడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఓ అంకానికి తెరపడింది. ఈనెల 11న స్క్రూటిని జరగనుండగా, 13న ఉపసంహరణ గడువు ఉండటంతో ఎవరెవరు పోటీలో ఉంటారనేది మరింత క్లారిటీ రానుంది.నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ ఉన్నారు. వీరిద్దరు కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే మొత్తంగా 26మంది అభ్యర్థులే మాత్రమే నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం అందుతోంది. కరోనా నిబంధనలు, ఇతరత్రా కారణాలతో పోలీసులు నామినేషన్ కేంద్రాలకు గుంపులుగా వచ్చిన వారిని అడ్డుకొని తిరిగి పంపించారు.పోలీసులకు అభ్యర్థులకు మధ్య స్పల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల తీరును ఖండిస్తూ పలువురు అభ్యర్థులు నామినేషన్ సెంటర్ వద్ద ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులకు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ కారణంగా నామినేషన్లు ఎక్కువగా నమోదు కాలేదనే టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వత్రంత్ర అభ్యర్థులు మాత్రం నేడు నామినేషన్లు దాఖలు చేశారు.మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ సజావుగానే ముగిసిందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నేడు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా టీఆర్ఎస్ నుంచి ఇటీవలే గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇక చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనేతలు వచ్చారు. దీంతో నామినేషన్ సెంటర్ల వద్ద పెద్దఎత్తున కోలాహలం కన్పించింది.హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియలో ఓ కీలక ఘట్టం ముగియడంతో అసలు యుద్ధానికి తెరలేచింది. పోలింగ్ తేదికి మరో 20రోజులే ఉండటంతో అభ్యర్థులంతా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. ఓటర్లను ఆకర్షించేలా హామీలు, తాయిళాలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఎన్నిక పోరును టీఆర్ఎస్, బీజేపీ ఛాలెంజ్ తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సైతం పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏదిఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొంది.

Related Posts