విజయవాడ
కృష్ణాజిల్లా ముసునురు మండలం తాళ్లవల్లి గ్రామ పచ్చని పొలాల నడుమ త్వరలో ఐదున్నర అడుగుల ఎత్తులో శ్రీ హానుమత్ క్షేత్రం దర్శనమివ్వనుంది. నూజివీడుకు 13కిలోమీటర్ల దూరంలో జంగన్నగూడెం పంచాయతీలో 15గ్రామాల మధ్య భాగన పూలు పండ్ల తోటల ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారు కొలువుదీరనున్నారు. సుమారు 2ఎకరాల విస్తీర్ణంలో వైకానస శాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణం,భక్తులకు నిత్యఅన్నదాన సత్రం,వసతి గదుల నిర్మాణ ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. వైశాఖ మాసంలో ఆలయ ప్రారంభోత్సవం గావించి,స్వామి వారికి నిత్య సేవలు,మాస, పక్ష,సంవత్సర ఉత్సవాలు నిర్వహిస్తామనీ ఆలయ స్థల,నిర్మాణ వ్యవస్థాపకులు వేదాo తం.వెంకట అనంత రామశాస్త్రులు తెలిపారు. తూర్పున ఆంజనేయుడు, దక్షిణాన లక్ష్మి నరసింహుడు, పడమర గరుక్ మంతుడు, ఉత్తరనా వరాహాస్వామి, హైగ్రీవాస్వామి ల రూపంతో దర్శనమివ్వనున్నారు. ఏ ప్రాంతంలోనైనా చాలా చోట్ల పంచముఖ రూపంలో స్వామి వారి విగ్రహాలు మాత్రమే ఉండగా, పంచముఖ ఆంజనేయుల వారికి దేవాలయం నిర్మించి పూజలు అందుకునే అరుదైన ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తొలి గుడిగా పేర్కొన్నారు. శ్రీమాన్ వేదాంతం.కేశవ చార్యుల వారు పూర్వం 15 గ్రామాల ప్రజలకు నిత్యం సైకిల్ పై తిరుగుతూ ఉచిత ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందారు. ఓ రోజున మార్గమద్యంలో ఒక బాటసారి అనారోగ్య బారిన పడగా అతనికి వైద్యం అందించి తిరిగి వెళుతున్న వైద్యుని కేశవచార్యుని చేతిలో పంచలోహ పంచముఖ ఆంజనేయుల వారి ప్రతిమను ఇచ్చి నిత్యం పూజలు చేస్తే శుభం కలుగుతుందని తెలిపి ఒక అజ్ఞాత రోగి వెళ్లిపోయింది. నాటి నుండి తరతరాలుగా స్వామి వారికి భక్తి శ్రద్దలతో వేదాంతం కుటుంబీకులు పూజలు నిర్వహించారు. ఆయుర్వేద వైద్యుడు కేశవ చార్యుల వారి కోరిక మేరకు పంచముఖ స్వామి వారి విగ్రహాoకు ఆలయం నిర్మించి నిత్య పూజలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని స్థలం కొనుగోలు చేసి ఆలయ నిర్మాణంకు కేశవచార్యుల వారి వంశీకులు పూనుకున్నారు.