బీజింగ్ అక్టోబర్ 9
తైవాన్‌ను చైనా దేశంలో కలుపుకుంటామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేసారు. తమ లక్ష్యాన్ని కచ్చితంగా తైవాన్ ఏకీకరణను శాంతియుతంగా చేపట్టనున్నట్లు తెల్పారు.. తైవాన్ ఏకీకరణను శాంతియుతంగానే సాధించాలని, వేర్పాటువాదాన్ని వ్యతిరేకించే వైభవ సాంప్రదాయం చైనా ప్రజలకు ఉన్నట్లు ఆయన పరోక్ష వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ భవిష్యత్తు దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. కానీ తైవాన్ తమ ప్రావిన్సు అని చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక ఏకీకరణ కోసం తైవాన్‌పై దళాలను కూడా వినియోగించేందుకు వెనుకాడేదిలేదని ఇటీవల చైనా స్పష్టం చేసింది. సుమారు 150 చైనా యుద్ధ విమానాలు ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2025 నాటికి తమ దేశాన్ని చైనా ఆక్రమించేస్తుందని తైవాన్ అభిప్రాయపడింది.