YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం

హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం

కరీంనగర్, అక్టోబరు 11,
హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం మొదలైంది. ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్‌ హోరా హోరీ తలపడుతున్న ఈ పోరులో ఓటరు ఎటువైపు? నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు అధికార పార్టీ గెలుపు మంత్రంగా ప్రభుత్వ పథకాలను ఓటరు చెంతకు తీసుకుపోతోంది. మరోవైపు, దగాపడ్డ తెలంగాణ బిడ్డలా ..ఆత్మగౌరవం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మరి ఈటల వైపు సానుభూతి పవనాలు వీస్తాయా..లేదంటే అభివృద్ధికి పట్టం కడతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. నిన్నటి ఇప్పడి వరకు నియోజకవర్గం ప్రజలు బీజేపీ, టీఆర్‌ఎస్ హంగామా మాత్రమే చూశారు. ఇక నుంచి కాంగ్రెస్‌ ప్రచార హోరు కూడా చూడనున్నారు. అంతేనా , ఈ ప్రధాన పార్టీలతో పాటు బరిలో నిలిచిన నిరుద్యోగ అభ్యర్థులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూడా హల్చల్‌ చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని చేసినా ఓటరు క్లారిటీ ఓటరుకు ఉంటుంది. అయితే, నిబంధనల పుణ్యామా అని రాజకీయ పార్టీలకు జనం ముందు తమ సత్తా చూపించుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే కేసీఆర్‌ ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. హూజూరాబాద్ ప్రచారంలో కేసీఆర్‌ బదులు కేటీఆర్‌ ప్రచారం చేస్తారని టాక్‌. ఇప్పటి వరకు హుజూరాబాద్‌ ప్రచార భారం అంతా హరీష్‌ రావు తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్‌ తోడుకానున్నారు.మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు , సీనియర్‌ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిలో ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి ..గ్రామస్థాయిలో ఎలా డీల్‌ చేయాలనే దానిపై స్పష్టంగా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇంటింటికి వెళ్లి తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలపై వివరించాలని పార్టీ క్యాడర్‌ని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది.ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసినా భారీ బహిరంగ సభ ఒక్కటయినా ఉండాలి. లేకపోతే ఓటరు ఏదో వెలితిగా ఫీలవుతాడు.ఎలక్షన్‌ ఓల్టేజీ కూడా పెరగదు. అలాగే, జనం మూడ్‌ కూడా భారీ బహిరంగ సభల ద్వారా తెలిసే అవకాశం వుంది. కానీ కోవిడ్‌ నిబంధల వల్ల రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఆ అవకాశం లేదు. పరిమిత సంఖ్యలో ర్యాలీలు..సభలకు మాత్రమే పర్మిషన్‌ ఉంది. ఈసీ నిబంధనల ప్రకారం ప్రచార సభలకు వేయి మందికి మించి జనం రాకూడదు. అయినా కేసీఆర్‌ కనీసం ఒక్క భారీ బహిరంగ సభ అయినా పెట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ దీని మీద ఎన్నికల సంఘానికి ఓ విజ్ఞాపన పత్రం సమర్పించింది. దానిని ఇంకా ఆమెదించలేదు. హుజూరాబాద్‌లో ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టు ఉన్న పరిస్థితిలో కేసీఆర్‌ ఒక్క బహిరంగ సభతో మొత్తం సీన్‌ మారిపోతుందని..గెలుపు తథ్యమని గులాబీ దళం బలంగా నమ్ముతోంది.రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయింది. కోవిడ్‌ 19 పూర్తిగా నియంత్రణలో ఉన్నందున సభకు సడలింపు ఇవ్వాలని గులాబీ పార్టీ ఈసీని కోరింది. ఒక వేళ అది సాధ్యం కాకపోతే మీటింగ్‌ని వేరే చోటికి మార్చాలన్నది వ్యూహం. కరీంనగర్, హుస్నాబాద్, హన్మకొండలను పరిశీలిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నారు. పార్టీ సమావేశాలు నిర్వహించకుండా ఈసీ ఆపలేకపోతున్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు.మరోవైపు, ప్రధాన గ్రామాల్లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ల ద్వారా వర్చువల్ మీటింగులు పెట్టాలని కొందరు నాయకులు సూచించినట్టు సమాచారం. దీనిని పార్టీ వర్గాలు కొట్టి పారేయటం లేదు. కానీ కేసీఆర్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చినట్టు సమాచారం. మరోవైపు, టీఆర్ఎస్ ఎత్తుగడలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది. ఒక వేళ నియోజకవర్గం వెలుపల టిఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తే తామూ అలాంటి వ్యూహమే రచిస్తామని కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ అలా చేస్తే జాతీయ నాయకులను రంగంలో దించే అవకాశం ఉంది. అమితాషా వంటి టాప్‌ లీడర్స్ ఈ ప్రచార సభలో పాల్గొనే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మీటింగ్‌కు అనుమితి ఇస్తుందా ..లేదా అన్నది వేచి చూడాల్సి వుంది.మరోవైపు కాంగ్రెస్‌ కూడా వేగం పెంచింది. లేట్‌ గా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్టు హస్తం పార్టీ ప్రచారంలో దూకుతోంది. 20 మందితో కూడిన ప్రచార బృందం జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ తో పాటు పలువురు రాష్ట్ర నేతలు ఉన్నారు. అయితే అజారుద్దీన్, అనసూయ వంటి స్టార్‌ క్యాంపెయినర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Related Posts