హైద్రాబాద్, అక్టోబరు 11,
రూల్స్ కు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ మరోసారి ఎంక్వైరీ మొదలుపెట్టింది. నలుగురు జాయింట్ డైరెక్టర్ల (జేడీ)తో కూడిన కమిటీ ఈ పని ప్రారంభించింది. రాష్ర్టంలో కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్ కేవలం ట్యూషన్ఫీజులు మాత్రమే పేరెంట్స్ నుంచి తీసుకోవాలని, గతేడాది ఉన్న ఫీజులనే ఈసారి తీసుకోవాలని, అది కూడా ప్రతినెల వసూలు చేయాలని ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను చాలా స్కూళ్లు పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంతో పాటు ఒకేసారి మొత్తం ఫీజులను పేరెంట్స్నుంచి వసూలు చేశాయి. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. హైకోర్టు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోయారు.ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రెండు నెలల కిందట సుమారు 50 స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. ఇద్దరు జేడీ స్థాయి అధికారులతో విచారణ చేయించారు. అయితే ఈ ఎంక్వైరీలో స్పష్టత రాలేదు. దీంతో తాజాగా ఐదు రోజుల కిందట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 సీబీఎస్ఈ సిలబస్ స్కూళ్లలో మరోసారి విచారణ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం జాయింట్ డైరెక్టర్లు సోమిరెడ్డి, రాజేశ్, రమేశ్, సత్యనారాయణరెడ్డితో కమిటీని వేశారు. ఈనెల 7 లోగా రిపోర్టు ఇవ్వాలని డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. అయితే సమగ్ర విచారణకు మరో పదిరోజుల సమయం కావాలని జేడీలు కోరారు. ఈ మేరకు ఈనెల 20 లోపు రిపోర్టును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు కమిటీ అందించనుంది. ఇప్పటికే పలు స్కూళ్లకు సంబంధించిన రికార్డులను డీఈఓలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని జేడీలు పరిశీలిస్తున్నారు. అయితే రాష్ర్టంలోని స్టేట్సిలబస్ స్కూళ్లలో ఏ ఒక్క స్కూల్ కూడా రూల్స్ ఉల్లంఘించలేదని అధికారులు చెప్తుండటం గమనార్హం.మౌంట్ లిటేరా జీ స్కూల్, మెరీడియన్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, నారాయణ హైస్కూల్ –డీడీ కాలనీ, కల్పస్కూల్, సెయింట్ ఆండ్రూస్–సికింద్రాబాద్, సెయింట్ ఆండ్రూస్–మేడ్చల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్–హిమాయత్ నగర్, నీరజ్ పబ్లిక్ స్కూల్–అమీర్ పేట.