YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

టీమిండియా 77 ఓవర్లలో 187 పరుగులకే అలౌట్

 టీమిండియా 77 ఓవర్లలో 187 పరుగులకే అలౌట్

 మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జోహన్స్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య బుధవారం నుంచి ఆఖరి టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. తొలిరోజు ఆటలో టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా 77 ఓవర్లలో 187 పరుగులకే అలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు విసురుతోన్న బంతులకు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (106బంతుల్లో 9 ఫోర్; 54 పరుగులు), పుజారా (179 బంతుల్లో 8 ఫోర్లు; 50 పరుగులు) హాఫ్ సెంచరీలతో చెలరేగినప్పటికీ మిగితా ఏ బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్ మాత్రమే 30 పరుగులు చేయగా, మిగతావారిలో లోకేశ్ రాహుల్ (0), మురళీ విజయ్ (8), అజింక్యా రహానె (9), పార్థివ్ పటేల్ (2), హార్థిక్ పాండ్యా (0), షమీ (8), ఇషాంత్ శర్మ (0), బుమ్రా (0; నాటౌట్) పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్ బాట పట్టారు. టీమిండియాకు ఎక్స్ ట్రాల రూపంలో 26 పరుగులు వచ్చాయి. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 187 (76.4) పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కె రబాడా మూడు వికెట్లు తీసుకోగా, ఎన్గిడీకి ఒక వికెట్, మార్కెల్, ఫిలండర్, అండిలే రెండేసి వికెట్లు తీశారు.

అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా ఓపెనర్లలో మార్కమ్ (2) పరుగులకే చేతులేత్తేయగా, ఇల్గర్ (4), రబడా (0) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో సఫారీ జట్టు 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 6 పరుగులతో కొనసాగుతోంది. భారత బౌలర్లలో భువీకి ఒక వికెట్ దక్కింది. 

Related Posts