YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తడ టీడీపీ పరిస్థితేంటి..?

తడ టీడీపీ పరిస్థితేంటి..?

సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్‌ ఉన్నా.. నేడు ఆ పార్టీని ముందుకు నడిపే పెద్దదిక్కు లేక అయోమయం నెలకొంది. పార్టీ కీలక నేతల్లో ఒకరు జైలుపాలు కాగా... మరొకరు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలుకావడంతో పార్టీ పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల క్రితం వరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీలను నడిపేది మాత్రం సూళ్లూరుపేట, తడ, మండలాలకు చెందిన వారే.

గతంలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి రాజకీయాలు నడపగా. టీడీపీ నుంచి వేనాటి రామ చంద్రారెడ్డి, కొండేపాటి గంగాప్రసాద్‌ వర్గాలు ఇక్కడ రాజకీయం చేసేవారు. నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్‌ నిర్ణయించడంలో కూడా వీరిదే కీలకపాత్ర. తడ మండలంలో టీడీపీకి వేనాటి వర్గం నుంచి వేనాటి పరంధామరెడ్డి ముఖ్య భూమిక పోషించేవారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి టీ డీపీనేత వేనాటి పరంధామరెడ్డి.. ఇద్దరి స్వగ్రామం మండలంలోని చేనిగుంట కావడంతో ఇద్దరు పోటాపోటీగా రాజకీయాలు నడిపేవారు. ఎప్పుడూ ఒ కరిపై మరొకరు పైచేయి సాధించేందుకే కృషి చేసే వారు.

2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అదే సంవత్సరం డిసెంబ రులో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కాంగ్రెస్‌కు రా జీనామా చేసి తెలుగేదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో వాకాటి రాకను వేనాటి వర్గాం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా అధిష్ఠానం నిర్ణయంతో వే నాటి వర్గం సర్ధుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైకి సర్దుబాటు దోరణిలో ఉన్నా లోలోపల మాత్రం ఇ రువర్గాలు పాత బాణీనే కొనసాగించేవారు. దాం తోపాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అరెస్టు త రువాత ఆయన వర్గం నేతలంతా టీడీపీలో అంటీ ముట్టనట్లుగా వ్యవ హరిస్తుండటంతో ఇక వారు టీడీపీలో కొనసాగేది కష్ట మేఅంటూ గుసగుసలు మొదలయ్యాయి.

ఏప్రిల్‌ 17వ తేదీ తెల్లవారుజామున ఒంగోలుకు సమీపంలో వేనాటి పరంధామరెడ్డి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆయన సైతం పార్టీలో చురుకైనపాత్ర పోషించాలంటే కొద్దినెలలు పడుతుందని ఆయన వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయేది ఎన్నికల సీజన్‌.. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉన్న సమయం పార్టీపై పట్టున్న ఇద్దరూ ప్రజలకు దూరంగా మసలుకోవాల్సిన పరిస్థితి రావడంతో వారు వచ్చేదాకా మండలంలో పార్టీని నడిపే నాయ కుడు ఎవరన్న చర్చలు మొదలయ్యాయి.

రాష్ట్రవ్యా ప్తంగా ప్రత్యేక హోదాపై టీడీపీ బలమైన పోరాటం చేస్తుంటే, మండలంలో మాత్రం ఆ ఊసు కనపడటం లేదు. పార్టీ అధిష్ఠానం ఆదేశించిన విధంగా ఇంతవ రకు ప్రత్యేక హోదా సైకిల్‌ యాత్రలు ఇక్కడ మొదలు కాకపోవడం విశేషం. మరోవైపు నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ పరసారత్నంకు ఈ రెండు వర్గాలు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుంటంతో ఆయన సైతం ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు. ఈ పరిణామాలతో పార్టీలో అయోమయం నెలకొందని కొందరు వ్యాఖ్యానించుకొంటున్నారు. రానున్న ఎన్నిక ల్లో ఈ ఆయోమయం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని విశ్లేషకులు అంటున్నారు.

Related Posts