విజయవాడ
విజయవాడ చిట్టి నగర్ సొరంగం రోడ్డులో ఒక బార్ లో బ్లేడ్ బ్యాచ్ ఆదివారం రాత్రి వీరంగం చేసింది. తాగిన మత్తులో అక్కడి బార్ లో అద్దాలు పగలగొట్టారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను పోలీసులు నియంత్రించేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం సొరంగం రోడ్లో బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్ ఆగడాలు జరుగుతూనే ఉంటాయని స్థానికులు అంటున్ఆనరు. ఆదివారం రాత్రి గొడవ సృస్తించిన బ్లేడ్ బ్యాచ్ సభ్యుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సదరు బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని తన తలతో బలంగా గుద్దుకోవడంతో గాయాలపాలయ్యాడు. సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.