న్యూఢిల్లీ అక్టోబర్ 11
లఢక్‌లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఇండియా, చైనా మిలిటరీ కమాండర్ల మద్య జరిగిన స్థాయి చర్చలు విఫలమైనట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి మాత్రం అంగీకరించినట్లు చెప్పింది.. తమ ప్రతిపాదనలకు చైనా అంగీకరించలేదని, ఎలాంటి ముందడుగు వేసే ప్రతిపాదనలను కూడా చేయలేదని భారత్ ఆర్మీ తెలిపింది. సమావేశం సందర్భంగా ఇంకా వివాదం ఉన్న ప్రాంతాల పరిష్కారానికి సంబంధించి ఇండియా వైపు నుంచి నిర్మాణాత్మక సూచనలు చేశాము.వాటికి చైనా అంగీకరించలేదు. దీంతో చర్చలు పరిష్కారం లేకుండానే ముగిశాయి అని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. అటు చైనా కూడా ఈ చర్చలు విఫలమైనట్లు ప్రకటించింది. ఇండియా అసమంజసమైన, అవాస్తవికమైన డిమాండ్లు చేసిందని చైనా తెలిపింది.