YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పకడ్బందిగా రైతు బంధు

పకడ్బందిగా రైతు బంధు

రైతు బంధు పధాకాన్ని ఈనెల పదవ తేదిన హుజురాబాద్ లో కేసీఆర్ ప్రారంభిస్తారు.  కోటి 40 లక్షల ఎకరాల 98 వేల 486 ఎకరాల వ్యవసాయ భూములను రైతు బంధు పథకం కింద 5608 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కొత్త పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీని వీడియో రికార్డ్ చేస్తారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర  ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో అయన డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీతో కలసి మీడియాతో మాట్లాడారు. సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వయంగా సంబంధిత రైతులకు మాత్రమే చెక్కులు అందిస్తాం గల్ఫ్ లో ఉన్నవాళ్ల రైతుల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఇస్తామని అన్నారు. 58 లక్షల రైతాంగానికి చెక్కుల పంపిణీకి 2 వేలకు పైగా బృందాలు పనిచేస్తున్నాయి. ఒకేసారి డిజిటల్ పాసు పుస్తకాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే సవరించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు బంధు పథకం విజయవంతం చేయాలని విజ్ఞప్తి  చేసారు. పాసు పుస్తకం ముద్రణకు 90 కోట్ల కేటాయిస్తే 80 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. ఉత్తమ్ ఆరోపణల్లో వాస్తవం లేదు. చెట్టు కింద ఉన్న వాళ్లకు చెట్టు పైన ఉన్న వాళ్లకు తేడా ఉంటదని అయన వ్యాఖ్యానించారు. ఆధార్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డ్, పాస్ బుక్ ఉంటే చాలు చెక్కులను అందిస్తామని అన్నారు. చెక్కులు తీసుకొనివారి నిధులను తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేస్తాం. రైతు సంక్షేమం కోసం వాడుతామని అన్నారు.

Related Posts