తిరుమల
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. ఆలయం దగ్గరకు చేరుకున్న సీఎం జగన్కు మహా ద్వారం వద్ద టీటీ డీ చైర్మన్, ఈవోలు స్వాగతం పలికా రు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.శ్రీవారి దర్శనం అనం తరం ముఖ్యమంత్రి ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. అలాగే తిరుమలలో 10 కోట్లతో నూత నంగా నిర్మించిన బూందీపోటు భవనా న్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనం తరం అన్నమయ్య భవన్లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని.. తిరుపతి ఎయిర్పోర్ట్కు వెళతారు. ఉదయం 11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు.అలాగే తిరు పతిలో బర్డ్ ఆస్పత్రి దగ్గర శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలో వైద్య సేవలందించే వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమల వరకు పునర్నిర్మిం చిన నడకమార్గం పైకప్పును కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.