YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నం ఫేక్ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటర్

పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నం ఫేక్ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటర్

పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నం
ఫేక్ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటర్
ముష్కరుడిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు
న్యూ ఢిల్లీ అక్టోబర్ 12
ఇండియాకి వ్యతిరేకంగా పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. ఉగ్రవాదులను భారత్ లోకి పాకిస్తాన్ పంపుతున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. పాక్ కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటరయ్యాడు. కానీ పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. స్పెషల్ సెల్ పోలీసులు ఆ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకే-47తోపాటు హ్యాండ్ గ్రనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ ఐ ఏజెంట్ అయిన ఈ ఉగ్రవాది ఢిల్లీలో దాడులకు ట్రైనింగ్ తీసుకున్నాడు.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జమ్ముకశ్మీర్ తో పాటు దేశంలోని ప్రధాన నగారాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్ ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ యూపీ జమ్ముకశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేస్తోంది. మరోవైపు ఎన్ కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ దళాలు దూకుడు పెంచాయి. ఈరోజు షోపియన్ లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.వాళ్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు భద్రత దళాలు. అటు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవటం ఆర్మీకి పెను సవాల్గా మారింది. కొన్ని రోజులుగా సామాన్య ప్రజలే టార్గెట్గా కశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. తుపాకీ తూటాలకు అమాయకులను బలిస్తున్నారు. తుపాకీ శబ్దాలతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు.దీనితో ఉగ్రవాదుల అంతు చూసేందుకు రంగంలోకి దిగింది ఆర్మీ. నిన్న పూంచ్ సెక్టార్ లో జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారు. అందులో నలుగురు జవాన్లు ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నారు. మరోవైపు సురాన్ కోట్ లోని మొఘల్ రోడ్డు సమీపంలో ఉన్న అడవుల్లోకి ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. LOC దాటి చార్మేర్ అడవిలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదుల గుంపు చొరబడినట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారు.

Related Posts