YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

నిధుల గోల్‌మాల్‌లో మరో ట్విస్ట్

నిధుల గోల్‌మాల్‌లో మరో ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో మరో ట్విస్ట్ బయటపడింది. ఏపీలో రెండు ప్రభుత్వ సంస్థల ఎఫ్‌డీలను కూడా గోల్‌మాల్‌ చేసినట్లు తేలింది. ప్రధాన నిందితుడు సాయికుమార్‌ ఏపీ గిడ్డంగుల సంస్థ, ఏపీ నూనెగింజల సంస్థల ఎఫ్‌డీలను కొల్లగొట్టాడని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీ స్కామ్‌పై కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలను చెప్పారు.ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన సుమారు రూ.10కోట్లు, ఏపీ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.5కోట్లు విలువైన ఎఫ్‌డీలను దారి మళ్లించినట్లు ఈ నెల 10న అధికారులు గుర్తించారు. దీంతో బ్యాంకు అధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన ఎఫ్‌డీలు విజయవాడ భవానీపురంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో ఉన్నాయి. ఐవోబీ నుంచి ఎఫ్‌డీ సొమ్మును ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటీవ్‌ సొసైటీకి బదిలీ చేసి.. అక్కడి నుంచి సాయికుమార్‌ ముఠా సొమ్ము డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు.ఆయిల్‌ఫెడ్‌కు చెందిన ఎఫ్‌డీలు వీరపునాయునిపాలెం సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో ఉన్నాయి. అందులోని రూ.5కోట్ల ఎఫ్‌డీనీ కొట్టేసినట్లు గుర్తించారు. కాగా, మర్కంటైల్‌ సొసైటీ చైర్మన్‌ సత్యనారాయణరావుకు భారీగా కమీషన్‌ ఇచ్చి నిధులు విత్‌ డ్రా చేయడంలో సాయికుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలంగాణ పోలీసులు.. ఏపీ ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఏపీ సీఐడీ ద్వారా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఐవోబీ బ్యాంకు ఉద్యోగుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు.ఏపీ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో ఎఫ్‌డీల సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించామని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోందని.. సొమ్ము కొట్టేసిన వారిపై చట్టపరంగా చర్యలుంటాయన్నారు. ఆయా బ్యాంకుల అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారని.. ఎవరెవరి పాత్ర ఉందో విచారణ జరుపుతామన్నారు

Related Posts