YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇవాళ రైతులకు పండుగే తొలిసారిగా రైతలకు నాలుగు వేలు పంపించేందుకు చర్యలు 11 గంటలకు కరీంనగర్ లో కేసీఆర్ చేతుల మీద ప్రారంభం

ఇవాళ రైతులకు పండుగే  తొలిసారిగా రైతలకు నాలుగు వేలు పంపించేందుకు చర్యలు 11 గంటలకు  కరీంనగర్ లో కేసీఆర్ చేతుల మీద ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధం పధకానికి అంతా సిద్ధమైంది. రైతు బాంధవుడిగా ఎకరాకు రూ. 4 వేల చొప్పున పారదర్శకంగా, పకడ్బందీగా అన్నదాతకు ఎలా చేర్చాలనేదానిపై సిఎం కెసిఆర్ చేసిన ఆలోచన, అందుకు అనుగుణంగా చేపట్టారు. రాష్ట్రంలోని 10,823 గ్రామాలలోని 1.40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి రూ. 5,608.09 కోట్లను చెక్కుల రూపంలో రైతులకు చేర్చే ఉద్దేశంతో ప్రభుత్వం తొలిదశకు సన్నాహాలు చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 8 బ్యాంకుల నుంచి రైతుబంధు చెక్కులు జిల్లాలకు చేరుకున్నాయి. మొత్తం 58.06 లక్షల చెక్కులకు గాను 56.14 లక్షల చెక్కులు బ్యాం కుల నుంచి జిల్లాలకు, సంబంధిత మండలాలకు చేరాయిఇక ప్రభుత్వం ఇచ్చిన చెక్కును తీసుకుని, రైతు బ్యాంకులో నగదు తీసుకోవడమే తరువాయి. అలాగే కొత్త పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ‘పార్ట్ ఎ’లో భాగంగా ఉన్న 57,33,025 లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. వీటి ముద్రణ కూడా తుది దశకు చేరుకుంది. భూప్రక్షాళనలో 2.38 కోట్ల ఎకరాల భూమిని ప్రక్షాళన చేయగా, మొదటి దశలో 2.21 కోట్ల ఎకరాల భూమి ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. ఇందులోనే 1,40,98, 486 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు నిర్ధారించారు. కోర్టు కేసులు, లిటిగేషన్‌లు ఉన్న భూమి 16.53 లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించారు. ఇందులో 4.22 లక్షల ఖాతాలు ఉన్నాయి. వీటిని ఈ నెల 20వ తేదీ తరువాత సానుకూల వాతావరణంలో పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 ప్రభుత్వం పంపిణీ చేయనున్న పట్టాదారు పాసు పుస్తకాలు 17 సెక్యూరిటీ ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. ధర్మరాజుపల్లిలో ఉదయం 11 గంటలకు సిఎం కెసిఆర్ రైతు బంధును ప్రారంభిస్తారని, 11.15 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టనున్నారు

Related Posts