YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్సీల కోసం పోటా పోటీ

ఎమ్మెల్సీల కోసం  పోటా పోటీ

వైసీపీ అధినేత జగన్ కు చేతినిండా పని పడింది. త్వరలో మొత్తం 14 ఎమ్మెల్సీ పదవులు ఖాళీకానున్నాయి. ఈ పథ్నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీయే గెలుచుకుంటుంది. ఇందులో 11 స్థానాలు స్థానిక సంస్థల కోటా కింద ఎన్నిక కావాాల్సి ఉండగా, మూడు ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మొన్నటి వరకూ జరగకపోవడం, కోవిడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు.ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఏకపక్షంగా వైసీపీ విజయం సాధించింది. దాదాపు అన్ని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. తాడిపత్రిలో మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పక్కకు తప్పుకుంది. కొన్ని చోట్ల పోట ీచేసినా అది నామమాత్రమే. స్థానిక సంస్థలలో దాదాపు 90 శాతం వైసీపీ యే దక్కించుకుంది. దీంతో 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.ఇక ఎమ్మెల్యే కోటాలో వైసీపీ సభ్యుల ఆధారంగా మూడు స్థానాలను ఆ పార్టీయే దక్కించుకుంటుంది. ఇక్కడ టీడీపీ పోటీ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో 14 మందిని జగన్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఎప్పటిలాగానే జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీలను ఎంపిక చేస్తారంటున్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడిన వారితో పాటు వచ్చే ఎన్నికలకు పార్టీకి ఉపయోగపడే వారు కూడా ఈ జాబితాలో చోటు చేసుకునే అవకాశముంది.ప్రధానంగా ఎమ్మెల్యే కోటా కింద ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ 14 మంది ఎమ్మెల్సీలలో కాపు సామాజికవర్గంతో పాటు బీసీలకు కూడా ఎక్కువ మందికి అవకాశం దక్కనుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 14 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతుండటంతో ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts