YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ పోలవరం

టార్గెట్ పోలవరం

పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అయితే జగన్ నిర్దేశించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు జగన్ సమీక్ష చేస్తున్నా మెఘా ఇంజినీరింగ్ కంపెనీ సమర్థతపై నమ్మకంతో జగన్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారబోతుంది. అందుకే జగన్ ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని భావిస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించింది. అప్పటి నుంచి పనులు నత్తనడకనే నడుస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 70 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. కానీ అదంతా ఒట్టిదేనని ప్రస్తుతం అధికార పార్టీ చెబుతుంది. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయవకపోవడం వల్లనే చంద్రబాబుకు గత ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయి.ఇప్పుడు జగన్ ముందున్న టాస్క్ కూడా అదే. 2022 నాటికి పోలవరం పూర్తి చేస్తానని జగన్ చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు ప్రాజెక్టు నుంచి నీళ్లు అందిస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసిన వెంటనే ఖరీఫ్ సీజన్ కు నీళ్లందించాలన్నది జగన్ లక్ష్యం. అయితే ఈ పనులు అప్పటి వరకూ పూర్తవుతాయా? లేదా? అన్నదే ప్రశ్న. పనులు వేగవంతంగా జరుగుతున్నా నిధుల సమస్య వెంటాడుతుంది.కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ప్రతి దానికి కొర్రీలు పెడుతుండటంతో కాలమంతా ఢిల్లీకి వివరణ ఇవ్వడానికే సరిపోతుంది. దీంతో ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ఫైళ్ల క్లియరెన్స్ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించాల్సి వస్తుంది. అయినా ఏదో ఒక సాకుతో బిల్లులను చెల్లించకుండా వాయిదా వేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ అనుకున్న సమయానికి పూర్తవుతాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Related Posts