YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఆర్బీఐ స్కాలర్ షిప్

ఆర్బీఐ స్కాలర్ షిప్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  స్కాలర్షిప్ స్కీమ్ ప్రకటించింది. నెలకు రూ.40 వేల చొప్పున మూడు నెలల పాటు స్కాలర్షిప్స్ అందిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా కాలేజీల్లో ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ స్కాలర్షిప్స్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తం 5 స్కాలర్షిప్స్ ప్రకటించింది ఆర్బీఐ. ద్రవ్య, ఆర్థిక శాస్త్రం లాంటి అంశాల్లో షార్ట్ టర్మ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైనవారు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ లేదా రీజనల్ ఆఫీస్లో కొంతకాలం పరిశోధన చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్తో పాటు రీసెర్చ్ పేపర్ విజయవంతంగా పూర్తి చేసినవారికి రూ.1,50,000 పారితోషికం కూడా లభిస్తుంది.కాగా, ఆర్బీఐ ఈ స్కాలర్షిప్ స్కీమ్కు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫామ్ను పోస్టులో పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 20 చివరి తేదీ. అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. దరఖాస్తు ఫామ్ కోసం ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు పాల్సిన అడ్రస్ నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ స్కీమ్కు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకోండి.
► స్కాలర్షిప్స్ సంఖ్య- 5
► ప్రాజెక్ట్ కాలం: గరిష్టంగా మూడు నెలలు
► స్కాలర్షిప్: నెలకు రూ.40,000 చొప్పున మూడు నెలలు లభిస్తుంది.
► స్కాలర్షిప్ స్కీమ్ ప్రారంభం: 2021 డిసెంబర్ 6
► అర్హతలు: ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దరఖాస్తు చేయాలి.
► వయస్సు: 55 ఏళ్ల లోపు

Related Posts