ఆప్ఘనిస్థాన్‌తో టెస్ట్, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టు ఎంపిక చేసింది. కాగా ఈ టెస్ట్‌కు కెప్టెన్‌గా అజింక్యా రహానె వ్యవహరించనున్నారు. విరాట్ కొహ్లీ సారథ్యంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో మొత్తం 16 మంది సభ్యుల వివరాలను బీసీసీఐ ప్రకటించింది.రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి అంబటి రాయుడు వస్తున్నాడు. బెంగళూరులో జూన్ 14 నుంచి ఆప్ఘనిస్థాన్‌తో భారత్ టెస్ట్ జరగనుంది. కాగా.. టీం ఇండియా జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. 2018 జూలై 3 నుంచి 8వ తేదీ వరకూ టీ-20 సిరీస్, జూలై 12 నుంచి 17 వరకూ వన్డే సిరీస్ జరుగనుంది. అనంతరం ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకూ భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది.టీ20 జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనీష్ పాండే, ఎంఎస్ ధోనీ(కీపర్), దినేశ్ కార్తీక్, యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, సిద్ధార్త్ కౌల్, ఉమేష్ యాదవ్.వన్డే జట్టు వివరాలు: కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, రాహుల్, శ్రేయాస్, రాయుడు, ధోనీ, వాషింగ్టన్ సుందర్, బూమ్రా, పాండ్యా, సిద్ధార్ధ్ కౌల్, చాహల్, ఉమేశ్ యాదవ్, శార్దుల్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్