YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నో ఎంట్రీ

ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నో ఎంట్రీ

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్‌ నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకత్వమే కాదు.. బలమైన కేడర్‌ కూడా ఉంది. అలాంటిది ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లో నేతలు స్తబ్దుగా ఉండిపోవడం గాంధీభవన్‌ వర్గాల్లో చర్చగా మారింది. కొత్త పీసీసీ సారథ్యంలో పలు జిల్లాల్లో సభలు.. సమావేశాలు పెడుతున్నారు. మరికొన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు ముందుకొచ్చి.. సభలకు డేట్‌ ఫిక్స్‌ చేయమని కోరే పరిస్థితి ఉందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకులు అప్పుడప్పుడూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ ఎంట్రీ ఇవ్వలేని పరిస్థితి.ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు. పార్టీలో హేమాహేమీలుగా గుర్తింపు పొందినా.. ఇక్కడ పార్టీ యాక్టివిటీ లేకపోవడంలో రకరకాలుగా చర్చకు దారితీస్తోంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఆ ప్రభావం వల్లే పీసీసీ కూడా ఇటు పెద్దగా ఫోకస్‌ పెట్టడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ చీఫ్‌ పదవి దక్కలేదన్న బాధ నుంచి ఇంకా బయటపడలేదు. రేవంత్‌ను ఓపెన్‌గానే వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ వెంకటరెడ్డి చురుకుగా పాల్గొనడం లేదు. దళిత గిరిజన దండోరా సభ నల్లగొండలో పెట్టాలని అనుకున్నా.. అక్కడి నాయకులు నో చెప్పడంతో దానికి బ్రేక్‌ పడింది.పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించే చోట కాంగ్రెస్‌ కార్యక్రమాల ఊసే లేదు. పైగా ఉత్తమ్‌, రేవంత్‌ మధ్య సఖ్యత లేదన్నది ఓపెన్‌ టాక్‌. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్‌పై ఓపెన్‌గా విమర్శలు చేస్తే.. ఉత్తమ్‌ ఎక్కడా బయట పడరు. చేయాల్సింది కామ్‌గా చేసుకుని వెళ్లిపోతారని రేవంత్‌ టీమ్‌ అనుమానం. పీసీసీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి వెనక ఉత్తమ్‌ ఉన్నారనే అనుమానం కూడా రేవంత్‌కు ఉందట. ఇలా నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నాయకులతో సఖ్యత లేకపోవడంతో అక్కడ సభలు, సమావేశాల ప్రస్తావనే లేదు.మాజీ మంత్రి జానారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జానారెడ్డి కుమారుడు రఘువీర్‌తో రేవంత్‌ ఇంకా సన్నిహితంగా ఉంటారు. జానారెడ్డి ఇలాకాలో సభ పెట్టాలని అనుకున్నా.. ఓ ముఖ్య నాయకుడు నో చెప్పినట్టు సమాచారం. దీంతో పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ సైలెంట్‌ అయిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీపట్ల పోలీసుల తీరును నిరసిస్తూ జరిగిన ఆందోళనలో ఈ ఎంపీలిద్దరూ తళుక్కుమన్నారు.పీసీసీతో ఇక్కడి నాయకుల వైరం ఎప్పటి వరకు కొనసాగుతుంది? కలిసి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా.. లేవా? కాంగ్రెస్‌లో ఇదో అంతుచిక్కని ప్రశ్న. అప్పట్లో ఇబ్రహీంపట్నం సభ విషయంలోనే రేవంత్, కోమటిరెడ్డి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నాటి నుంచి ఉమ్మడి నల్లగొండ జోలికి రేవంత్‌ వెళ్లడం లేదని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి.. ఈ పంచాయితీలకు పార్టీ పెద్దలు ఫుల్‌స్టాప్‌ పెడతారో లేదో చూడాలి.

Related Posts