YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసిపి లో తిరుగుబాటు

వైసిపి లో తిరుగుబాటు

వైసిపి లో తిరుగుబాటు
నెల్లూరు
నెల్లూరు జిల్లా వైసిపి లో తిరుగుబాటు మొదలయింది. వైకాపా నేతలే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  అవినీతి చిట్టావిప్పిడం చర్చనీయాంశమయింది.  ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేసారు.  ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి కేంద్ర బిందువుగా మారారని విమర్శలు చేసారు.  నెల్లూరులోని ఓ హోటల్ లో ఉదయగిరి వైసీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి  ఉదయగిరి జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు, నాయకులు హాజరు అయ్యారు. మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ  జగన్ ఆశయాలకు ఎమ్మెల్యే తూట్లు పొడుస్తున్నారు.  ప్రతి పనికి రేటు నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నాడు.  మండల కన్వీనర్ పదవికి 10 లక్షలు రేటు కట్టి మూడు నెలల కి ఒకసారి మార్చేస్తున్నారు.  వింజమూరులో బి ఫామ్ ఇచ్చిన వ్యక్తికి కాక స్వతంత్రుడు ఎంపిపి అయ్యారు.  రేట్లు కట్టి పదవులు అమ్ముకుంటున్నారు.  అంగన్ వాడీ ఆయా నుంచి టీచర్ల పోస్ట్ వరకు డబ్బులు దండకం చేస్తున్నాడు.  2019లో చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని అందలం ఎక్కించారు.  పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులని పక్కన పెట్టేసారు. - కష్టపడి వైసీపీని ఉదయగిరిలో గెలిపించుకున్నాం.  సచివాలయ నిర్మాణం కోసం అప్పసముద్రంలో సొంత స్థలాన్ని వితరణ చేశాను. - ఆ జిఓలో దాత అయిన నా పేరు తీసేసి కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు.
 ఎమ్మెల్యే వల్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు విసిగిపోతున్నారు.  జగన్ పాదయాత్ర నుంచి మేము ఆయన వెంటే మేము తిరిగాం.  ఇవాళ ఉదయగిరిలో జరుగుతున్న అవినీతి, ఎమ్మెల్యే తీరుకు విసిగిపోతున్నాము.  జెడ్పిటిసి పదవి కోసం మేము 50 లక్షలు ఇచ్చాము. వెంటనే చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ చేపట్టి, ఉదయగిరికి కొత్త ఇంచార్జ్ ని నియమించాలని అన్నారు.

Related Posts