YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా

జన సేనా మరో డిసాస్టరే... వర్మ సెటైర్లు

జన సేనా మరో డిసాస్టరే... వర్మ సెటైర్లు

పవన్‌కల్యాణ్‌పై, అతని అభిమానులపై వర్మ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో మరోసారి రెచ్చిపోయాడు. రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘ఆఫీసర్’ సినిమా రెండో టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. అయితే యూట్యూబ్‌లో ఈ మూవీకి లైక్‌లకు సమానంగా డిస్‌లైక్‌లు రావడంతో వర్మ పవన్ అభిమానులపై మరోసారి హాట్ కామెంట్లు చేశాడు. 11 కోట్ల మంది తెలుగు వారిలో పవన్ అభిమానులు 11 వేలేనా అని, ఓ పవన్ అభిమానిగా నేను ఫీల్ అవుతున్నానని, తన ఆఫీసర్ మూవీకి ఇంకా డిస్‌లైక్స్ కొట్టి పవన్ ఫ్యాన్స్ తమ సత్తా చాటాలని వ్యంగ్యాస్ర్తాలు సంధించాడు.ఇలా అయితే చిరంజీవి ప్రజారాజ్యం లాగే జనసేనుడు కూడా డిజాస్టర్ అవుతాడని... పవన్, అతని ఫ్యాన్స్‌పై వరుస ట్వీట్లు చేస్తూ రెచ్చిపోయాడు. సినీనటి శ్రీరెడ్డి వ్యవహారంలో వర్మపై పవన్ సీరియస్ అయ్యాక కొన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న వర్మ మళ్లీ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. వర్మ ట్వీట్లపై పవన్, ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో, ఈ పరిణామాలు ఎంత వరకు దారితీస్తాయో చూడాలి మరి.

Related Posts