YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గంజాయి మూలాలు ఏపీలోనే వున్నాయి

గంజాయి మూలాలు ఏపీలోనే వున్నాయి

వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్షలో టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు, మాజీ మంత్రి,  శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి నాటి నుంచి  టీడీపీ నాయకులు, కార్యకర్తల పై భౌతిక దాడులు చేసి, ఆర్దిక మూలాలు దెబ్బతీసినా టీడీపీ శ్రేణులు భయపడకుండా  వైసీపీ అరాచకాలపై పోరాడుతున్నారు. వైసీపీ అరాచక, అవినీతి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి జాతీయ చంద్రబాబు ఇంటిపై దాడి చేసినా దైర్యంగా ఎదుర్కొన్నాం. వైసీపీ రౌడీ మూకలు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని అన్నారు. వైసీపీ డ్రగ్స్, అక్రమ వ్యాపారాలపై పట్టాభిరాం ప్రశ్నిస్తే వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై ఆపీసుపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడు జరగలేదు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయి -  ఇది వాస్తవం కాదా? ఈ విషయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులు సైతం చెబుతున్నారు.  మీ తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? వైసీపీ అరాచకాలను దేశానికి తెలిజేయాలని  ఈ 36 గంటల దీక్ష చేస్తున్నాం. పోలీసుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా  విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు టీడీపీ నివాళి అర్పిస్తోందని అన్నారు.
రాష్ట్రంలోని డీజీపీ, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో  అమరులైన పోలీసుల ఆత్మ ఘోషిస్తోంది. ఇలాంటి పోలీసు వ్యవస్ధను దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు,  గూండాలు, రౌడీలను కొంతమంది పోలీసులు కుమ్మక్కయ్యారు. డీజీపీ ఆపీసుకు కూతవేటు దూరంలో దాడి జరిగితే కనీసం డీజీపీ స్పందించలేదు, పోలీసుల పనితీరుపై ప్రజలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  వైసీపీ నేతలు బూతులు మాట్లాడలేదని ముఖ్యమంత్రి అంటున్నారు.... ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన ఏమై మాట్లాడారో ఇప్పుడు వైసీపీ మంత్రులు, నేతలు ఏం మాట్లాడుతున్నారో చర్చకు సిద్దమా?  ప్రతిపక్షంలో చంద్రబాబు ను నడిరోడ్డుపై కాల్చాలి, చీపుర్లలతో కొట్టాలని జగన్  అనలేదా?  వివేకాందరెడ్డి హత్య, కోడికత్తి కేసు చంద్రబాబు, లోకేశ్ ,  టీడీపీకి ఆపాదించి లబ్ది పొందిన పార్టీ వైసీపీ అని అన్నారు.
వైసీపీ ఎన్ని అరాచకాలు చేసినా టీడీపీ కార్యకర్తలు  ధైర్యంగా రక్షణ కవచంలా పార్టీని కాపాడుతున్నారు.  వైసీపీ చేసే అరాచకాల్లో మేం అధికారంలో ఉన్నపుడు 1 శాతం చేసినా మీ పరిస్థితి ఏంటి? టీడీపీని భూస్ధాపితం చేయాలని జగన్ అనుకుంటున్నారు.అది జగన్ తండ్రి తాత వల్లే కాలేదు, ఇక జగన్ వల్లే ఏమవతుంది? ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ  టీడీపీని ఎవ్వరూ   ఏం చేయలేరని అన్నారు.

Related Posts