YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు స్పందించలేదు - చంద్రబాబు నాయుడు

పోలీసులు స్పందించలేదు - చంద్రబాబు నాయుడు

ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు.  మీకు చిత్తశుద్ధి వుంటే డ్రగ్స్ అరికట్టండి.  మాపై కాదు మీ ప్రతాపం.. హెరాయిన్, డ్రగ్స్, గంజాయి వాడే వారి మీద చూపండని టీడీపీ జాతీయ అధ్యక్షుడు,  మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  గురువారం ప్రారంభమయిన 36 గంటల దీక్షలో అయన మాట్లాడారు.  జగన్ లాంటి విభిన్నమైన వ్యక్తిని సరిచేసే శక్తి టీడీపీకే వుంది.  సమాజం సర్వనాశనం అయ్యాక పదువులు ఉంటే ఎంత లేకుంటే ఎంత?  ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్  అని అన్నారు.
 నిరసన దీక్ష ఎన్టీఆర్ భవన్ లో చేయడం ప్రత్యేకమైన పరిస్థితి.   వచ్చిన సమస్య పట్ల ప్రజల్ని చైతన్యంవంతం చేయడం గానీ, ప్రజలకు న్యాయం చేయడానికి అనేక విధాలుగా పోరాటం చేస్తాం. అందులో నిరాహార దీక్ష, ధర్నాలు చేస్తుంటాం. కానీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్నాం.   దాడి జరిగిన చోట నుండే నిరసన దీక్ష చేస్తున్నాం.  70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న కార్యాలయం ఇది.    తెలుగు ప్రజలకు పవిత్రమైన దేవాలయం.  అలాంటి దేవాలయం మీద, కార్యకర్తల మనోభావాల మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం.   దేశ చరిత్రలో, నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులు చూడలేదు.   జరగరాని సంఘటనలు జరిగినప్పుడు ఆవేశంలో చిన్నవి జరగవచ్చుకానీ, ఒక పద్ధతిగా టీడీపీని తుదిముట్టించాలి, భయబ్రాంతులను చేయాలి, ఎవరైనా టీడీపీలో వుండాలన్నా, ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నారు.   ఈ దాడులపైన పెద్ద కుట్రే జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే వుంది.   వైసీపీ వాళ్లు వచ్చినప్పుడు మేము వర్చువల్ మీటింగ్ లో ఉన్నాం.   అప్పుడే 4.30 గంటలకు పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని సమాచారం వచ్చింది.   పట్టాభి భార్యను, 8 ఏళ్ల చిన్న అమ్మాయిని కాపాడాలని ఆలోచిస్తున్నాం, ఆలోపే ఇళ్లు మొత్తం ధ్వంసం చేశారు.   మామాలుగా ఆవేశం వుంటే..రాయి వేసి, ఒక దెబ్బ కొడతాం.  కానీ చిన్నపిల్ల వుంటే వారి మనోభావాలు ఆలోచించకుండా దాడి చేశారంటే వారి మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి.  పెద్దయ్యాక అదే మనోభావాలు గుర్తుంటాయి.   వెంటనే డీసీపీ, డీజీపీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ అప్పుడే.. డీజీపీ కార్యాలయం పక్కన, సీకే కన్వెన్షన్ నుండి 150 మంది పార్టీ కార్యాలయానికి బయలు దేరారని సమాచారం అందింది. వెంటనే 5.03 నిమిషాలకు డీజీపీకి ఫోన్ చేశాను.   ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.   నేను ఫోన్ చేస్తే పనులున్నాయని డీజీపీ ఫోన్ తీయలేదు.   పక్కన వుండే అర్బన్ ఎస్పీకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని అయన అన్నారు.

Related Posts