YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రేవంత్ కు శత్రువులు వాళ్లేనా

రేవంత్ కు శత్రువులు వాళ్లేనా

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డికి పార్టీలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఆయనను రెడ్డి సామాజికవర్గం నేతలే ఎక్కువగా వ్యతిరేకిస్తుండటం విశేషం. మిగిలిన సామాజికవర్గం నేతలు రేవంత్ రెడ్డితో సర్దుకుపోతున్నా రెడ్డి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ అంటేనే రెడ్డి సామాజికవర్గం పార్టీగా ముద్ర పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ముద్ర నుంచి బయటపడలేకపోయింది.పీసీసీ అధ్యక్షులుగా వేరే సామాజికవర్గాల వారిని నియమించినా రెడ్డి సామాజికవర్గం నేతలే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలను అప్పగించడాన్ని ఎక్కువ మంది రెడ్డి సామాజికవర్గం నేతలే వ్యతిరేకించారు. అయినా అధిష్టానం ఆయనకే పదవిని కట్టబెట్టింది. అయినా ఆయనను ఫెయిల్ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది రెడ్డి సామాజికవర్గం నేతలే.రేవంత్ రెడ్డి కి సానుకూలంగా మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, షబ్బీర్ ఆలి, దామోదర రాజనర్సింహ, మధు యాష్కి సీతక్క, కొండా సురేఖ వంటి నేతలు ఉన్నారు. రేవంత్ రెడ్డికి వీరంతా సహకరిస్తున్నారు. కానీ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలు పెద్దగా సహకరించడం లేదు. వీరికే కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద గ్రిప్ ఉంది. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందీ వీరే.ఇప్పటికే కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం పెత్తనం చేయాలని కోరుకుంటుంది. ఉత్తమ్ కు కేంద్ర పార్టీలో స్థానం దక్కడంతో ఆయన వర్గం ఎక్కువగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది. ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డిని రెడ్డి సామాజికవర్గం నేతలే ఎక్కువగా ఇరకాటంలోకి నెట్టే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి వీరిని దాటుకుని ముందుకు వెళ్లడం అంత సులువు కాదు. రేవంత్ కు ముందు ముందు ప్రమాదం వీరి నుంచే పొంచి ఉంది.

Related Posts