హైదరాబాద్, అక్టోబరు 23
రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి వెళ్లిపోతుదని అన్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు ఉంటే .. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని " సీఎం కేసీఆర్ తెలంగాణ సాధిస్తున్న పురోగతిని టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా విశ్లేషించారు. పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను తమకు అమలు చేయకపోతే .. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని నాందేడ్ వాసులు, కర్ణాటకలోని రాయచూర్ వాసులు కోరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున తమ పార్టీని అక్కడ కూడా పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను తమకూ కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారన్నారు.
స్వాప్నాలను శాసించే ధైర్యం ఉండాలని.. లేకుండా తెలంగాణ వచ్చేది కాదన్నారు. వనరులు సమైక్య పాలకులు ఎన్నోఇబ్బందులు పెట్టారన్నారు. జాగ్రత్తగా వాడుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం మొత్తం తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని మోయడానికి హమాలీలు, ఆడించడానికి మిల్లులు సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలనుకున్నా విపక్షాలు కేసుల మీద కేసులు వేస్తున్నారని విమర్శించారు. అయితే ఛేదింంచుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగామ ధరణి ఓ అద్భుతమైన విప్లవం అని అభివర్ణించారు. దేశానికి తెలంగాణ తల మానికంగా ఉందని.. దేశం కంటే తెలంగాణ ముందు ఉందన్నారు. చరిత్రలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు వెళ్లేవారని ఇప్పుడు పనులు ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. నాది తెలంగాణ అని ప్రతి ఒక్కరు తల ఎత్తుకునే స్థాయికి తీసుకెళ్లామన్నారు. దళిత బంధు పథకంపై కేసీఆర్ ఎక్కువ సేపు ప్రసంగించారు. దళితులకు చేయగలిగినంత చేస్తామన్నారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న వారికి సాంత్వన ఈ పథకమన్నారు. ఏపీ నుంచి కూడా దళిత బంధు అమలు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు 70 ఏళ్లకుపైగా పరిపాలించినా ఏమీ చేయలేకపోయాయని.. దళితుల దుస్థితికి వాళ్లే కారణమన్నారు. ఇప్పుడు దళితబంధు అమలు చేసే శక్తి ఒక్క టీఆర్ఎస్‌కు మాత్రమే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. రూ. లక్షా 70వేల కోట్లతో అమలు చేస్తామన్నారు. దళిత బంధుతోనే ఆగదని.. బీసీ, గిరిజన, ఈబీసీ వర్గాలతో పాటు అన్ని వర్గాలకూ పథకాలను వర్తింప చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని నడిపిస్తోంది.. తెలంగాణ ప్రజలేనన్నారు. తెలంగాణ నలువైపులా ప్రజా పునాది పటిష్టంగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని.. వాటిపై వచ్చే రూ. రెండు కోట్ల వడ్డీతో పార్టీని నడిపిస్తున్నామని.. జిల్లాల్లో కార్యాలయాలు నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. సభలో హుజురాబాద్ ఎన్నికలపైనా కేసీఆర్ స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరిస్ోతందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు. నవంబర్ నాలుగు తర్వాత గెల్లు శ్రీనివాస్ పథకాన్ని అమలు చేస్తారని ప్రకటించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దంగావ్యవహరించారని.. ఇది మీకు గౌరవం కాదన్నారు. ఇది తన హెచ్చరికగా కేసీఆర్ ఈసీకి తెలిపారు. బహిరంగసభ పెట్టకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ దళిత బిడ్డలు అదృష్టవంతులన్నారు.