YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ పార్టీకి ఇంకా తీరని బాలారిష్టాలు

 పవన్ పార్టీకి ఇంకా తీరని బాలారిష్టాలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు నేత‌లు క‌రువ‌య్యార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నా యి. రాజ‌కీయ వ్యూహంలో భాగంగా ప‌వ‌న్ త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంట రిగానే బ‌రిలోకి దిగేందుకు తీవ్ర‌స్థాయిలో య‌త్నిస్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి లేద‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. అయితే, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు అంత ఆషా మాషీగా లేక‌పోవ‌డం, మ‌రోప‌క్క‌, పోటీ తీవ్రంగా ఉండ‌డంతో ప‌వ‌న్ ఇక ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఆయ‌న‌కు అనుకున్న రేంజ్‌లో నేత‌లు మ‌ద్ద‌తు దొరకడం లేదు.వాస్త‌వానికి ఇప్పటి దాకా నియోజకవర్గాల సమీక్ష నిర్వహించడంలోనూ అభిమానులే కార్యకర్తలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్య నాయకత్వంపై జనసేనలో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు రాష్ట్రంలో 175 నియోజక వర్గాల్లోనూ పోటీ చేయనున్నట్టు పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేయడంతో కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. ఈ క్ర‌మంలోనే ప్రతిజిల్లాలోనూ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఏ జిల్లాలోనూ జ‌న‌సేన లోకి త‌ర‌లి వ‌స్తున్న నేతలు ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో బస్సు యాత్రను విజయవంతం చేయడానికి ప‌వ‌న్ అభిమానేలు ముందుకు వ‌స్తున్నారు. అయితే, వీరిలో చాలా మందికి స‌భ్య‌త్వం లేదు. దీంతో యుద్ధ ప్రాతిప‌దిక‌న‌ ఆన్‌లైన్‌లో సభ్యత్వానికి శ్రీకారం చుట్టారు.ఎన్నిక‌ల వ్యూహంలో భాగంగా ప్రత్యేక హోదా, ప్రజాసమస్యలపై మ‌రింత బ‌లంగా పోరాడేందుకు పవన్ బస్సు యాత్రను ప్రారంభించ నున్నట్టు ప్రకటించాడు.ప‌వ‌న్‌కు ఎదురు దెబ్బ‌త‌గిలే అవ‌కాశం క‌నిపిస్తోంది. 2007లో ప్ర‌జారాజ్యం పేరుతో పార్టీ పెట్టిన చిరంజీవికి వ‌చ్చినంత ఫాలోయింగ్ కూడా ఇప్పుడు ప‌వ‌న్‌కు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ప్రజారాజ్యం మాదిరిగా నాయకత్వం ముందుకు రావడం లేదు. అంతా పవన్‌ అభిమానులే క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పుట్టిల్లు ప‌శ్చిమ‌గోదావ‌రిలోనే ఈ ప‌రిస్థితి ఎద‌ర‌వుతోంది. ఇక్క‌డి జ‌న‌సేన‌లో భీమవరం పట్టణానికి చెందిన బొమ్మదేవర శ్రీధర్‌కు పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రజారాజ్యంలో కీలక పాత్ర వహించిన నర్సాపురానికి చెందిన తులసి ఇప్పుడు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కోశాధికారిగా ఏలూరుకి చెందిన రాఘవయ్య వ్యవహరిస్తు న్నారు. మిగిలిన వారంతా అభిమాన సైన్యమే.చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టిన ప్పుడు ప‌రిస్థితి భిన్నంగా ఉంది. కాపు నాయ‌కులు, మాజీ మంత్రులు, వివిధ స్థాయిల్లోని ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా క్యూక‌ట్టుకుని మ‌రీ చిరంజీవి ఇంటి ముందు వాలిపోయారు. కానీ, ఇప్పుడా ప‌రి స్థితి క‌నిపించ‌డం లేదు. నిజానికి ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి కీల‌క నాయ‌కులు ప‌వ‌న్ గూటికి వెళ్తార‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే, ఏ ఒక్క‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు క‌దిలింది లేదు.ప‌శ్చిమ‌గోదావ‌రిలో తాడేప‌ల్లిగూడెం సీటును గెలుచుకున్న ప్ర‌జారాజ్యం ఏకంగా చాలా నియోజక‌వ‌ర్గాల్లో టీడీపీని మూడో స్థానానికి నెట్టేసింది. డెల్టాలోని పాల‌కొల్లు, న‌ర‌సాపురం, భీమ‌వ‌రం, తాడేప‌ల్లిగూడెంతో పాటు ఏలూరు లాంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ మూడో ప్లేస్‌తో స‌రిపెట్టుకుంది. నాడు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు, టీడీపీ సిటు వ‌చ్చిన ఈలి నాని లాంటి వాళ్లు కూడా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లిపోయారు. కానీ నేడు ప‌వ‌న్ పార్టీలో చేరేందుకు యువ‌కులు త‌ప్ప పేరున్న వాళ్లు .. ఇంకా చెప్పాలంటే ఇత‌ర పార్టీల్లో ఉన్న ప‌వ‌న్ వీరాభిమానులు కూడా సాహ‌సించ‌డం లేదు. దీంతో ప‌వ‌న్‌పై రాజ‌కీయంగా అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డ‌డంతోనే ఇలా జ‌రుగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Related Posts