జగిత్యాల నవంబర్ 02
జగిత్యాల పట్టణ పాత్రికేయులకు గృహ నిర్మాణాల నిమిత్తం ఇళ్ల స్థలాలు కేటాయింపు ,లేక నిర్మాణం చేపట్టబడినటువంటి డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ మంగళవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు లేఖ వ్రాశారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ బలోపేతానికి తోడు నిలిచే విధంగా పాత్రికేయ సోదరులు ఫ్రీంట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు ఫోటోగ్రాఫర్స్ పోషించిన పాత్ర మనకు తెలిసిందేనని , తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజానీకానికి చేర వేస్తున్న పాత్రికేయుల కృషి ప్రశంసనీయం, సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రస్థాయిలో వారు చేస్తున్న కృషికి ప్రతీకగా వారిలో ఉన్నటువంటి పేదరికాన్ని పరిగణలోకి తీసుకుంటూ వారు పని చేస్తున్న కేంద్రాలలో ఇంటి నిర్మాణ స్థలం కేటాయింపుతో పాటు గృహ నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయింపు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకోన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా జగిత్యాల పట్టణం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రూపుదిద్దుకొనిన పరిస్థితులలో అక్రిడేషన్ పొందినటువంటి పాత్రికేయులకు ఇంటి నిర్మాణం కొరకు కావలసిన స్థలాలు లేక ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ప్రాధాన్యతగా కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.