ద్యాల రెవెన్యూ డివిజన్ నుంచి మత్తు పానీయాల దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమాలు . ఆంధ్ర ప్రదేశ్ ను మత్తు పానీయాల రహిత ఆంద్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుదాం.అని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి.నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు.మంగళవారం రామకృష్ణ డిగ్రి కళాశాల ఆడిటోరియంలో మత్తు పానీయాల నిర్మూలనపై కళాజాత కార్యక్రమాలను నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి.రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి.నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి.
కళాశాల అధినేత జి రామకృష్ణ రెడ్డి.ప్రారంభించారు.మత్తు పానీయాల నిర్మూలనపై కళాజాత కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ఎక్సైజ్ శాఖ సీఐ కృష్ణ కుమార్. భారత జ్ఞాన విజ్ఞాన సమితి డైరెక్టర్ సాయి కృష్ణ పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి. మాట్లాడుతూ మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీన కర్నూల్ లోని టిజివి కల్యాణ మండపంలో మత్తు పానీయాల పై కళాజాత ప్రారంభించడం జరిగిందన్నారు. 2 వ తేది న నంద్యాల రామకృష్ణ డిగ్రి కళాశాల ఆడిటోరియంలో జరిగిందన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల విద్యార్థుల మంచి భవిష్యత్తు నాశనం కావడం, కుటుంబాలు వీధిన పడడం, హత్యలు మానభంగాలు వంటి అనేక ఘోరాలు జరుగుతున్నాయన్నారు.
కావున యువత, విద్యార్థులను మత్తుపానీయాలకు గురికాకుండా కళాజాత కార్యక్రమాల ద్వారా నవంబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో డిగ్రీ,ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటి ప్రాంగణాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులలో గంజాయి పంట సాగు చేస్తున్న 4500 ఎకరాల్లో ఆంధ్ర ఒరిస్సా పోలీసులు గంజాయి పంటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు ఇందుకు స్థానిక ప్రజలు సహకరించాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గంజాయి,డ్రగ్స్,అక్రమ రవాణా మద్యం,నాటుసారా,గుట్కా ల పై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమాల వల్ల మద్యం వినియోగం 40 శాతం,బీరు వినియోగం 70 శాతం తగ్గిందన్నారు.మద్యం అక్రమాలపై 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు చేపడతామన్నారు. రంగం ప్రజానాట్య మండలి రాజేష్ వారి కళా రూపంలో ను మరియు మియ్య గారి గజిల్ ద్వార మద్యం సేవించడం వలన జరిగే అపార నష్టాన్ని గురించి.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి కళ రూపాల ప్రదర్శనలు ప్రదర్శించారు ఈ ప్రదర్శనలు విద్యార్థుల ఆకట్టుకున్నాయి.పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమాలపై రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి కళాజాత కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమన్నారు.
మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని మద్యం నివారించేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టాలన్నారు.రాష్ట్రంలోని 13 జిల్లాలలో మత్తుపదార్థాల నిషేధంపై కళాజాత కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభపరిణామమన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ పాఠశాలల ఎన్ సి సి మరియు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.